పుట:Prasarapramukulu022372mbp.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

10

ప్రసార ప్రముఖులు.

...............ఆకాశవాణికి ఆయన ఎనలేని సేవచేశారు. కర్ణాటక సంగీత విభాగం చీఫ్ ప్రొడ్యూసర్ గా ఢిల్లీలోని డైరక్టర్ జనరల్ కార్యాలయంలో పనిచేసి 19.. లో పదవీ విరమణ చేశారు. సంగీత లోకం ఆయనకు రుణపడి వుంది. వాద్యబృంద డైరక్టర్ కామశాస్త్రి, M. S. శ్రీరాం వీరి సన్నిహిత బంధువులు.

డా॥ ఆరెకపూడి రమేష్ చౌదరి

ఆంధ్రులు హిందీ సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. వారిలో ఆరెకపూడి ప్రముఖులు. ఆయన హిందీ, ఆంగ్ల భాషలలో సమ ప్రతిభ గలవారు. ఆకాశవాణిలో ఆయన డిప్యూటీ ఛీఫ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.

1922 నవంబరు 28 న కృష్ణాజిల్లా ఉయ్యూరులో రమేష్ చౌదరి జన్మించారు. పత్రికా రచయితగా ఆయన జీవితాన్ని ప్రారంభించారు. హిందూ, Free Press Journal, ఇండియన్ రిపబ్లిక్ పత్రికలలో ఆయన పనిచేశారు. హిందూస్తాన్ టైమ్స్, ఫోరమ్‌ పత్రికల కరస్పాండెంట్ గా వ్యవహరించారు.

హిందీలో దాదాపు పాతిక చక్కటి నవలలు వ్రాశారు. తెలుగు మాతృభాష అయినా తలస్పర్శిగా హిందీ భాషాభిమానుల ప్రశంసలు అందుకొన్నారు. ఆయన నవలలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏడు బహుమతులిచ్చింది. అది ఒక విశిష్ట గౌరవం 'సాఠ్‌గాంఠ్' నవల భారత ప్రభుత్వం బహుమతినందుకొంది. ఆయన రచనలు విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాలుగా ఎంపిక చేయబడ్డాయి.

సారా సంసార్ మేరా, నిర్లజ్జ, ధన్యభక్షు, ఉధార్ కే పంఖ్, అప్నే పరాయ్ నదీ కా శోర్ వీరి నవలల్లో ప్రముఖాలు. వీరి నవల రష్యన్ భాషలోని అనువదించబడడం మరో విశేషం. అడవి బాపిరాజు 'నారాయణరావు' నవలను వీరు హిందీలోకి అనువదించారు.

చందమామ, దక్షిణ భారత్ పత్రికలకు ఆయన కొంతకాలం సంపాదకులుగా వ్యవహరించారు. ఆయన స్వాతంత్ర సమరయోధులు కూడా. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తామ్రపత్రం ప్రభుత్వం నుండి పొందారు. 1980లో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూడా గౌరవ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరిని కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది.