పుట:Prasarapramukulu022372mbp.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

9

శంకరశాస్త్రి కాకినాడ మహారాజా కళాశాలలో పట్టా పొందారు. చిన్నతనం లోనే వీణావాదనలో ప్రావీణ్యం సంపాదించారు. 15వ ఏట ఆయన కాకినాడ సరస్వతీ గానసభలో తొలి కచేరి చేసి పండితుల ప్రశంసలందుకొన్నారు. ఆనాటి నుండి ఆయన దినదిన ప్రవర్ధమానవుతూ సంగీతవేత్తల ప్రశంసలను యావత్ భారతంలో అందుకొన్నారు.

ఆయన కొంతకాలం సినీరంగంలో పనిచేశారు. 1940 ప్రాంతంలో సంగీత దర్శకుడుగా చేరారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చి తమ ప్రతిభను చాటుకొన్నారు.

ఆకాశవాణిలో శంకరశాస్త్రి 1959లో సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా మదరాసు కేంద్రంలో చేరారు. హిందూస్తానీ పాశ్చాత్య సంగీతంలో ప్రవేశం సంపాదించి వాటి చక్కని మేళవింపుతో తనదైన వినూత్నశైలిని ఏర్పరచుకొన్నారు. ఆకాశవాణి వాద్యబృంద నిర్దేశకులుగా ఆయన ఎన్నో ప్రయోగాలూ చేశారు. ఆదర్శ శిఖరారోహణం, భ్రమరగీతం వంటి సంగీత రూపకాలు రూపొందించి శ్రోతల ప్రశంసలందుకొన్నారు. వీణపై వేదమంత్రాలు అలవోకగా పలికించి రసజ్ఞఉల మన్ననలందారు. "ఆసియన్ రోస్ట్రం అవార్డు" అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదంతో సత్కరించింది. ఆకాశవాణిలో సంగీత విభాగం ఛీఫ్ ప్రొడ్యూసర్ గా ఆయన రిటైరయ్యారు. కేవలం వీణావాదన మాత్రమేగాక వీణ కచేరీతో పాటు సోదాహరణ ప్రసంగాలు చేసి వివిధ ప్రాంతాలలో బహుళ జనామోదం పొందారు. గమకములు, అనుస్వరాలు లోకానికి విశదపరచిన మేధావి శంకరశాస్త్రి. ఆయనది గాత్రధర్మశైలి. వీణపై ఒక స్త్రీ కంఠ స్వరాన్ని పలికించి శ్రోతల్ని పులకింప జేసేవారు. రాగ హృదయాన్ని ఆవిష్కరింపజేయగల ప్రతిభాశాలి. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో ఆయనకు కనకాభిషేకం 1987లో జరిగింది. శంకరాభారణ రాగాలాపన ఆయన ప్రత్యేకత.

సుప్రసిద్ధ వైణికులు చిట్టిబాబు, శంకరశాస్త్రి శిష్యులు. యాహూదీ మొయిన్ హిన్ వంటి విదేశీ సంగీత ప్రముఖుల ప్రశంసలందుకొన్నారు. Prix Italia International అవార్డు ఆయన పొందారు.

గుంటూరులో కనకాభిషేకం అంది ఆ రాత్రి రైలులో ప్రయాణం చేస్తూ 1987 డిసెంబరు 8న నిద్రలోనే సునాయాస మరణాన్ని పొందారు.