పుట:PandugaluParamardhalu.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్ధించి విరుగుడు మందు తెప్పించుకొని తన సేవల్ని తిరిగి తేర్చుకున్నాడు. అప్పుడు ఉభయులకూ రాజీ జరిగింది.

  మరో కధ ప్రకారం యుద్ధ సమయంలో ఆకాశవాణి ఆ ఇద్దరు రాజుల్నీ ఉద్దేశీంచి నర్మదానదికి ఉత్తరాన్ని విక్రమార్కుని, దక్షిణాన్ని శాలివాహనుని రాజ్యం చేయమని తీర్పు చెప్పి యుద్ధాన్ని మానిపించిందని తెలియవస్తూ వుంది.
    శాలివాహనుడు శకస్థాపకుదు అయ్యారు.  ఆ శకానికి మొదటి దినం చైత్ర శుక్ల పాడ్యమి, కాగా ఈ పర్వము అతని శకస్థాపనతో సంబంధం కలది ఐంది.
   ఆంధ్ర, మహారాష్ట్ర, కర్నాటకులకు చైత్రాది దినమే సంవత్సరాది.
   ఆదిలో ఈనాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు.  ఈనాడే బ్రహ్మ దేవతల్ని ఆయాపనులకు నియోగించాడు.  నాటి నుంచి ఇది సంవత్సరాది అయింది.  ఇట్లని బ్రహ్మాండ పురాణ వాక్యము.
      ఆదిలో ఈనాడు ఆంరంభమైన సృష్టి కార్యకలాపం నేటివరకు అవిచ్చిన్నంగా, దినక్రమాభివృద్దిగా సాగుతూ ఉంది.
     ఈ హేతువు చేతనే ఈనాడు కొత్తగా లెక్కలు పెట్టడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనూచానమైన ఆచారమై ఉంది.
     బ్రహ్మ సృష్టికి ఆరంభంచేయడం వల్లనే కాకుండా ఇంకా ఇతర కారణాల చేతకూడా చైత్రశుక్ల పాడ్యమి పర్వమైందని పెద్దల వచనం.
     వనవాసానంతరం శ్రీరాండు సీతాసహితముగా అయోధ్యకు చైత్ర శుక్ల పాఢ్యమి నాడు తిరుగు ప్రయాణ సన్నాహం చేశాడని కలదు.  ఈ కారణం చేత కూడా ఇది పండుగ అయింది.
    వసురాజు తపస్సుచేసి రాజ్యపదవి సంపాదించిన పిమ్మట ఇంద్రుడు చైత్ర శుకిల పాఢ్యమి నాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు.  ఈ సందర్బం వల్ల కూడా ఈ పండుగ గణనకెక్కిందని అంటారు.
   ఇన్ని విధాల గణన కెక్కిన ఈ పర్యాచరణ విధానాలను ధర్మ సింధువు 'నూతన సంవత్సర కీర్తనాద్యరంభం ప్రతిగృహధ్వజారోహణం - నింబ పత్రాశనం - సంవత్సరాది శ్రవణం - నవరాత్రూరంభో అని చెబుతూ ఉంది.