పుట:PandugaluParamardhalu.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన పంచాంగ కర్తలు ఈనాడు చేయవలసిన పనులను ఇట్లా చెబుతున్నారు. 'అబ్దాది తైలాభ్యంగం - నూతన వస్త్రాభరణ ధారణం - నింబ కుసుమ భక్షణం - పంచాంగ శ్రవణం - ప్రపాదానం - రాజదర్శనం - వాసంత నవరాత్రి ప్రారంభం.

    వ్రత గ్రంధాల్లో ఈ పనులుకాక అధికంగా చత్రచామరాది స్వీకారం, బ్రహ్మపూజనం, దమనకపూజ, ఉమామహెశ్వర పూజ, సర్వాపచ్చాజ్ంతికధ, మహాశాంతి, పౌరుష ప్రతిపద్వ్రతము మున్నగునవి ఈనాటి కృత్యాలుగా చెప్పబడుతున్నాయి.
   వీనిని అన్నిటిని సమన్వయం చేసి పరిగణిస్తే ఆనాటి విధాయక కృత్యాలలో క్రింది పదిన్నీ ముఖ్యమైనవిగా తేలుతూ ఉంది.
      (1) ప్రతిగృహధ్యజారోహణం
      (2) తైలాభ్యంగం
      (3) నవవస్త్రాభరణధారణం, చత్య్రభామరాదిస్వీకారం
      (4) దమనేన బ్రంహపూజనము
      (5) సర్వాకచ్చాంతకరాహాశాంతి, పౌర్షప్రతిపద్ర్యము.
      (6) నింబకుసుమ భక్షణం
      (7) పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం
      (8) ప్రపాదాన ప్రారంభం
      (9) రాజదర్శనం
     (10) వాసంత నవరాత్రి ప్రారంభం
     ఉగాది నాటి ఈ పది విధాయకిఅకృత్యాల వివరాలను తెలిసుకోవడం మంచిది.
    శాస్త్ర చొదితమైన ఈ పది ఆచారాల్లో ఈనాడు మనము ఎన్ని ఆచరిస్తున్నాము!
                     ప్రతి గృహధ్వజారోహణం
    పూర్వ గ్రంధాల్లో ఈనాడు ప్రతియింట ధ్వజారోహణం విధాయకకృత్యంగా చెప్పబడింది.
    ప్రతి యింటి యందునూ ధ్వజాన్ని నిలపడం విజయచిహ్నం, ప్రతిదేవాలయానికి ధ్వజస్తంభం ఉంటుంది.  మనకు స్వరాజ్యం వచ్చినప్పటి నుంచీ జెండా ప్రత్రిష్టాపనోత్స్దవాలు పరిపాటిగా ఉంటున్నాయి.  సంవత్సరాది