పుట:PandugaluParamardhalu.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణ డోలోత్సవం

    చైత్రశుక్ల తదియనాడు, ఉమాశివులను దమనముతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్పఫలితం ఉండేటట్లే ఈనాడు లక్ష్మీనారాయణులను దమనముతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని శాస్తవచనం.
                          రుక్మిణీపూజ
     రుక్మిణీదేవిని ప్రత్యేకపూజలు అందే దినము ఇది.  రుక్మిణి శ్రీకృష్ణుని పెద్ద పెళ్లాము. ఆమె మహనీయురాలు.  కుండిన నగరమునకు రాజైన భీష్మకుని కూతురు.  సోదరుడు ఈమెను శిశుపాలునకు ఇచ్చి పెళ్లి చేయప్రయత్నపడెను.  ఆ పెళ్లి ఆమెకు ఇష్టము లేక పోయినది.  కృష్ణుని వివాహమాడాగోరి తన స్వయంవరానికి వచ్చి తన్ను రాక్షస వివాహముననైనను చేసుకొనమని సందేశం  పంపినది.  ఆ కబురు అందుకుని కృష్ణుడు వచ్చి స్వయంవరసమయాన వచ్చిన రాజుల ఓడించి రాక్షస వివాహమున ఈమెను తీసుకొనివెళ్లేడు.
       రుక్మిణి గొప్ప పతివ్రత, సవతి అగు సత్యభామకు ఈమెవల్ల ఈసు ఎక్కువ. ఒకసారి సత్యభామ నోము ఒకటి నోమినది.  ఆనోము సందర్భంలో కృశ్హ్ణుని తులాబారము తూచినది.  ఒక తులలో కృష్ణుని కూర్చోపెట్టింది.  రెండోతులలో తనవద్ద ఉన్న నగలు, నాణేలు అన్నీ ఉంచింది.  వీటి అన్నిటి బరువు కృష్ణుని బరువుకు సరితూగలేదు.  అప్పుడు సత్యకు వ్రతభంగవవుతుందని భయమువేసి రుక్మిణీదేవిని సలహా అడిగింది.  అప్పుడు రుక్మిణె సత్యభామ వేసిన నగలను అన్నిటిని తీసి వేయించి తాను ఒకతులసీదళాన్ని కృష్ణుని పై మనస్సు నిలిపి తులలో పెట్టింది. కృష్ణుని కంటే ఈ తులసీదళమే ఎక్కువ బరువు అయింది.
   రుక్మిణీ పతి ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలిపే మరి ఒక గాధ ఉంది.  ఒకనాదు కృష్ణుడు రుక్మిణీదేవిలోగిట లోపలి మందిరంలో ఉన్నాడు.  రుక్మిణీదేవి ఏకాంత సేవాచతుర అయి అతనికి వీవనతో మెల్లగా విసరుతూ ఉంది.  పతి యేరూపము దాల్చినం ద్దమ రూపంబైన రూపంబుతో సతి దాసుండెడునట్టి రూపవతి, అనవ్యమతి అయిన రుక్మిణీదేవితో విరసోక్తులు పలికాదు కృష్ణుడు.  శిశుపాలుణ్ణి పెళ్లాడక నన్ను పెళ్లాడేవు.  నేను నీకు తగను.  నీకు తగిన మరి ఒక మనుజేంద్రుని పెళ్లాడు అన్నాడు.  ఆ