ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఏకాదశి అని అర్ధము. లలిత అనే గంధర్వ స్త్రీ ఈనాడు ఏకాదశి వ్రతాన్ని తన యొక్క కొరిక ఈడేర్చుకొన్నది.
లలిత భర్త ఒక గంధర్వుడు. గంధర్వుడై ఉండి కూడా అతడు సంగీతము సరిగ్గా పాడలేక పోయాడు. అందుచేత శాపం తగిలి అతడు రాక్షసుడుగా మారిపోయాడు. అప్పుడు వాని భార్య లలిత ఏకాదశి వ్రతాన్ని చేసి ఆ పుణ్యముతో భర్తను శాపవిముక్తునిగా చేసింది. ఆమె కోరిన కోరికను నెరవేర్చింది కాబట్టి ఈయేకాదశికి కామదైకాదశి అనే పేరు వచ్చింది.
వాడపల్లి ఏకాదశి
ఉభయ గోదావరి మండలాల్లో ఈ ఏకాదశిని వాడపల్లి ఏకాదశిగా వ్యవహరిస్తారు. వాడపల్లి ఏకాదశి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. వాడపల్లిలో వెలసిన దైవం వేంకటేశ్వరస్వామి. చైత్రమాసంలోని మొదటి అయిదు దినాలి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఏకాదశినాడు మాల మాదిగల తిరునాళ్లు రధోత్సవము నాటికి మాలమాదిగలు విశేషంగా వచ్చేవారు. ఆబోతులను ఊరేగిస్తూ పాటలు పాడుకొంటూ వారు వచ్చేవారు. కాటెద్దులకు ఆనాడు అక్కడ గొప్పపూజ ఉండేది. పశుగణాభివృద్ధికి ఆబోతుల అవశ్యకత కొలదులు పెట్ట తరము కానిది. అయినప్పటికి ఎప్పుడు ఆబోతులను తీసుకువచ్చే మర్యాదను నిలిపివేశారు. ఆబోతులులేని ఉట్టిరధోత్సవం మాత్రం సాగుతూ ఉంది.
వాడపల్లి వెంకన్న పెద్ధవెంకన్న అనీ, పెద్ద తిరుపతి వెంకన్న బుల్లివెంకన్న అనీ గోదావరి జిల్లాలలో సంప్రదాయకంగా చెప్పుకుంటారు. పెద్ద తిరుపతి వెంకన్న ఉత్తర హిందూదేశంలో బాలాజీ అనే పేరు ఉంది. ఈ పేరును గోదావరి జిల్లాలలోని గుడికీ ఏమైనా సంబంధం ఉందేమో విజ్ఞు లు విచారించాలి.
ఈనాటి వివరణలో మన పంచాంగకర్తలు శ్రీ కృష్ణడోలోత్సవం, రుక్మిణీపూజ, యమపూజ, అని వ్రాస్తారు. ఈనాడు దమనముతో మహిషిపూజ చేయాలని స్మృతి కౌస్తుభము. విష్ణువును పూజించి డోలోత్సవం చేయాలని మఱికొన్ని వ్రతగ్రంధాలు, కాశ్మీరదేశంలో ఈ ఏకాదశినాడు వస్తు పూజ చేస్తారని నీలమత పురాణములో ఉంది.