పుట:PandugaluParamardhalu.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందరూ ఒక చోట చేరి గౌరిని స్తోత్రం చేస్తూ పాటలు పాడతారు. వెళ్లిపోయేటప్పుడు ప్రతి స్త్రీ దేవివద్ద తన భర్త నామం చెప్పాలి. ఈ పూజ జరిగిన ఐదవనాటి సాయంకాలం ఆ విగ్రహాన్ని ఊరేగించి తిరిగి ఇంటికి తీసుకువస్తారు. తిరిగి పాటలు పాడతారు. కుంకుమ పంచి పెడతారు. వడపప్పు ప్రసాదం ఇస్తారు. వెళ్లిపోయేటప్పుడు దేవి వద్ద ప్రతి స్త్రీ తన భర్త నామం చెప్పాలి.

ఈ పర్వసందర్భంలో స్త్రీ తన భర్త పేరు చెప్పే ఆచారం మహారాష్ట్ర మాళవదేశాల రెండింటిలోనూ ఉంది. సాధారణంగా హిందూ గృహిణికి తన భర్త పేరు చెప్పడం నిషిద్ధం. అయితే దేవి వద్ద స్త్రీ తన భర్త పేరు చెప్పడం నిషిద్ధం. అయితే దేవి వద్ద స్త్రీ తన భర్త పేరు చెప్పడం వల్ల దేవి కృప అతనికి దొరుకుతుందనే నమ్మకం ఈ ఆచారానికి ప్రాతిపదిక కానగును.

చైత్ర శుద్ధ తదియ నాడు సౌభాగ్యగౌరీపూజలు చేసే ఆచారం ఆంధ్రదేశాన లేదు. అరవనాట కూడా లేదు. అరవవారు ఈ గౌరీ పూజలు వైశాఖ మాసంలో చేస్తారు. సంక్రాంతికి పిమ్మట ముక్కనుమునాటి నుండి ఆంధ్ర స్త్రీలు ఆచరించే సావిత్రి గౌరీదేవి నోముల్లో ఈ వ్రతాచరణ విధానం ప్రాయకంగా అంతర్భాగమై ఉంది.

వ్రతోత్సవ చంద్రికాకారుడు కాశీప్రాంతాన ఈ పర్వ సందర్భంలో ప్రచారంలో వున్న కథను ఇట్లా చెబుతున్నాడు.

ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు అడవికి వెళ్ళారు. పార్వతికి దాహం అయింది. నీళ్లు ఎక్కడా దొరకలేదు. పక్షులు అన్నీ ఒక దిక్కుగా పోతూ ఉండడం చూచి ఆ దిక్కున జలాశయం ఉండవచ్చునని తలచి పార్వతి అటు వెళ్లింది. అక్కడ ఒక చిన్ననది ఉంది. తాగడానికి మొదటి పుడసిలి ఎత్తింది దానిలోకి దూబ్ గుచ్ఛము వచ్చింది. రెండోసారి పుడసిలోకి టేసు గుచ్ఛము వచ్చింది. మూడో పుడసిలోకి బెల్లపు ఉండ వచ్చింది. పార్వతి ఈ మూడు పదార్థాలు ఇట్లా వరుసగా రావడం చూచి చాలా వ్యాకుల పడింది. ఇంతలో ఈశ్వరుడు ఆమెకు ఆ దినము చైత్ర శుక్ల తృతీయ అని జ్ఞాపకం చేయగా దాని అంతరార్థం ఆమెకు అర్థమైంది.

సౌభాగ్యవతులైన స్త్రీలంతా గౌరీవ్రతం చేస్తూ ఉంటే నీవు అడివిలో తిరుగుతున్నావా అని శివుడు పార్వతిని వేళాకోళం చేశాడు. అప్పుడు