పుట:PandugaluParamardhalu.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మున్నగు నామాలతో స్త్రీల వ్రతాల్లో చేరింది.

ఈ వ్రతాలు హిందూ దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధరీతుల జరుపబడుతున్నాయి. ఆ విషయం కొంత తెలుసుకుందాము.

చైత్ర శుక్ల తదియను మహారాష్ట్ర పంచాంగములు గౌరీ తృతీయ అని పేర్కొంటాయి. గౌరి తపస్సు ఈనాడు ఫలోదయాంతం కావడం చేత దీనికి ఈపేరు తగిఉందని చెప్పవచ్చు.

ఈనాడు మొదలుపెట్టి మహారాష్ట్ర స్త్రీలు ఒక నెలరోజులు అనగా వైశాఖ శుక్ల తదియ వరకు గౌరీ వ్రతం చేస్తారు. ఇది సౌభాగ్యప్రదమైన వ్రతం కావడం చేత సౌభాగ్య గౌరీవ్రతమని పిలువబడుతూ ఉంది.

సౌభాగ్యప్రదమైన ఈ వ్రతప్రస్తావన దేవీ పురాణము, హేమాద్రి మున్నగు గ్రంథాలలో ఉంది. అయితే అది అక్కడ గణ గౌరి అనే పేరుతో పేర్కొనబడిణ్ది. అచటి ప్రస్తావనను పట్టి చూడగా ఇది కేవలం స్త్రీలు మాత్రమే ఆచరించే గౌరీ ఉత్సవం అయి ఉంది. శాస్త్రప్రకారం చూడగా ఇది రెండురోజుల పండుగగా కనిపిస్తుంది. కాని లౌకికంలో ఆ విధానం కానరాదు.

వ్రత గ్రంథాలను పట్టి చూడగా చైత్ర శుక్ల తృతీయ నాడు మహాదేవుడితో కూడిన గౌరికి పూజచేయాలి. ఆ పూజలో కుంకుమ, అగరు, కర్పూరం హెచ్చుగా వాడాలి. అలంకారానికి మణులు, మంచి వస్త్రాలు వాడాలి. రాత్రి జాగరణం చేయాలి.

వివాహాదుల్లో గౌరీపూజకు ఆంధ్ర స్త్రీలు రాతి విగ్రహాలను మాత్రమే వాడడం ఆచారం. కాని మహారాష్ట్ర స్త్రీలు ఈనాటి గౌరీ పూజకు ఇత్తడి విగ్రహాన్ని ఉపయోగిస్తారు. వాడు ఆ ఇత్తడి గౌరీ విగ్రహాన్ని ఒక చిన్న ఉయ్యాలలో ఉంచుతారు. ఇది శివడోలోత్సవ పర్వంనుంచి వచ్చిన విధానం కావడం కాదనరానిది. ఇరుగు పొరుగు స్త్రీలను పేరంటానికి పిలిచి వేడుక చేస్తారు. పేరంటాళ్లకు కుంకుమ, వడపప్పు మున్నగు ప్రసాదము, మిఠాయి ఇస్తారు. వెళ్లి పోయేముందు ప్రతి స్త్రీ దేవి వద్ద తన భర్త పేరు చెప్పాలి.

ఇక మాళవ స్త్రీలు ఈ వ్రతం ఆచరించే తీరు తెలుసుకొందాము.

మాళవ ప్రాంతపు స్త్రీలు ఈనాటి ఉదయాన్ని మట్టితో గౌరీ విగ్రహాన్ని చేస్తారు. దానిని బాగా అలంకరిస్తారు. సాయంకాలం స్త్రీలు