పుట:PandugaluParamardhalu.djvu/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దానం అనంతఫలాన్ని ఇస్తుందని తిధితత్వము.

         వైశాఖ పూర్ణిమను పంచాంగకర్తలు 'మహావైశాఖీ ' అని అంటారు.        
        అరవవారు 'వెయ్ కాసి విశాఖ ' అంటారు.  వెయ్ కాని అనేది విశాఖ మాసానికి అరవపేరు.  ఆ మాసంలో విశాఖ నక్షత్రం వచ్చేనాడు అనగా విశాఖ పూర్ణిమనాడు వారు ఒక పండుగ జరుపుతారు.  యమధర్మరాజు ఆనాడు పూజలు అందుతాడు.
     సుబ్రహ్మణ్యస్వామి విశాఖ పూర్ణిమనాడు అవతారమెత్తినట్లు చెబుతారు.
    నమ్మాళ్వారు అనే వైష్ణవ స్వామి పూర్ణిమనాడే పుట్టువునొందాడని చెబుతారు.  కూర్మావతారం కూడా ఈనాడే ప్రాదుర్బవించింది.  అందుచేత ఈనాడు కూర్మజయంతి జరుపుతారు.  ఇట్లని కొన్ని పురాణాలు దశావతారాల్లోను రెండు అవతారాలు ఈనాడే ప్రారంభం కావడం గమనింపతగ్గది.  కూర్మావతారమే కాక భౌద్ధవతారం కూడా ఈనాడే.
    వైశాఖ మాసంలో ఎండలు బాగా మదురుతాయి.  రాత్రి పగలు బాగా ఉక్కపోస్తూ ఉంటుంది.  కాగా మన పెద్దలు ఈనాడు దధ్యన్న, వ్యజన, చత్ర, పాదుకొపానహమున్నగుదానాలు, కృష్ణాజీనదానం ఉదకుంభదానం మున్నగు దానాలతో వైశాఖ పూజచేసే ఆచారాన్ని ఏర్పాటుచేశారు.
    తులసి, అశ్వత్ధమున్నగు వృక్షాలకు ఈ మాసంలో నీళ్లు పోయడం పుణ్యకార్యం.
     నమ్మాళ్వారు గొప్పవైష్ణవఋషి, అతడు వేదాలను అరవంలో చెప్పాడు.  తిరునల్వేళిజిల్లా తిరునగరిలో అతడు ఒకానొక వైశాఖ పూర్ణిమనాడు పుట్టువునొందాడు.  అందుచేత ఆనాడు తిరునగరి దేవాలయంలో గొప్ప ఉత్సవం చేస్తారు.  ఆ వూరికి ఆళ్వారు తిరునగరి అనే పేరు వచ్చింది.
   తంజావూరు చెంతగల తిరుమాఘవాడిలో కూడ విశాఖ పూర్ణిమ ఉత్సవం చేస్తారు.  అక్కడ ఒకానొకవైశాఖ పూర్ణిమనాడు శివుడు గొప్పగా నాట్యం చేశాడనీ, మరి ఒక వైశాఖపూర్ణిమనాడు ఈశ్వరుని నంది వాహనం అక్కడ పుట్టువు నొందించనీ చెబుతారు.  అందుచేత అక్కడ విశాఖ పూర్ణిమ ఉత్సవం గొప్పగా సాగుతుంది.
   విశాఖ పూర్ణిమ నాడు బ్రహ్మపురాణామును దానమిస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగునని చెబుతారు.