Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బుద్ధ జయంతి

       వైశాఖ పూర్ణిమ బుద్ధ జయంతి దినం.  బుద్ధుని జీవితకాలంలో వైశాఖ పూర్ణీమ మూడు సారులు అత్యంత ప్రాముఖ్యాన్ని వహించింది.

    అతడు ఒకానొక వైశాఖ పూర్ణీమనాడు పుట్టువు నొందాడు.
   మరి ఒక వైశాఖ పూర్ణిమనాడు అతడు బుద్ధుడు అయ్యాడు.
   వేఱొక వైశాఖ పూర్ణీమనాడు అతడు నిర్యాణము చెందాడు.
   ఈ విషయాన్ని సూర్యప్రకాశ అనువారు స్టేట్సుమెన్ పత్రికలో ఒక
కధగా ఇట్లా చెబుతున్నారు.

    "నాడు వైశాఖ పూర్ణిమ, రెండువేల ఐదువందల ఎనభైసంవత్సతాలకు మునుపు నేడు నేపాళము అనిపిలవబడే హిమాలయసానుప్రదేశాల చెంత శాక్యులను తెగవారు నివసిస్తూ ఉండిరి.  వారికి కపిలవస్తు అనే నగరం రాజధాని.  కపిలవస్తురాజనగరిలో రాణి మాయాదేవికి నీళ్లాడ ప్రొద్ధులు అయ్యాయి.  అట్టి సమయంలో ఆమె తన పుట్టింనింటికి పోవాలనే కోరికను వెల్లడించింది.  రాజు వెంటనే పాలకీ బోయీలను రప్పించి ప్రయాణ సన్నాహాలు చేశాడు.  
     ఆమె పుట్టినిల్లు తోడిశాక్య్హ ప్రజాసతాక రాజ్యమైన దేవదహనగగరం కపిలవస్తునుండి దేవదహకు పోయేదారి లుంబినీ వనం అనే అడవి గుండపోతుంది.  అక్కడ సాల వృక్షాలు సాంద్రంగా ఎదిగి ఉన్నాయి.  ఆవన మధ్యంలో ఒక చక్కని తామర కొలను ఉంది.  పుష్పించిన సాలవృక్షాలు చుట్టుబారలు తీరి ఉండగాఆ కలను ప్రశాంతంగా ఉంది.
    పల్లకీ అక్కడకు వచ్చింది.  మాయాదేవి నొప్పులు ప్రారంభమయ్యాయి.  పల్లకీ ఆపమని ఆమె ఆజ్ఞాపించింది.  ఆమెతో కూడ ఆమె సోదరి ఉంది.  పురిటి సమయం ఆసన్నమైందని ఆమె గ్రహించింది.  ఆదరాబాదరా అక్కడ బాగుచేసి పురుడు పోసుకోవడానికి అనువు ప్రచారు.  కొద్ది నిముధాల అనంతరం అక్కడ మాయాదేవి మగశిశువును ప్రసవించింది.  అతడే గౌతముడు..
  ముప్పైఐదు సంవత్సరాల అనంతరం మళ్ళీ అది ఒక వైశాఖ పూర్ణిమాదినం. ఆ వైశాఖపూర్ణిమాచంద్రుడు నేటి బీహారులోని గయ చెంతగల ఒక మట్టి వృక్షము మీద వృక్షము మీద వెన్నెల వెదజల్లుతూ ఉన్నాడు.
   అప్పటి ఆరేళ్ల పూర్వం గౌతముంఉ పెళ్లాన్ని, పిల్లవాడిని, రాజ్యూన్ని