పుట:PandugaluParamardhalu.djvu/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీడి మానవలోకం నుంచి దు:ఖాన్ని పారద్రోలడానికి పరిశ్రమిస్తూ శాక్యముని అయ్యాడు. సన్యాసుల సాంగత్యము, ఉపవాసములు, జపాలు, తపాలు ఏమీ కార్యకారులు కాలేదు. తుదకు అతదు మఱ్ఱి వృక్షము క్రింద కూర్చుని కొత్త వెలుతురుకోసం చిత్తాన్ని సమీకృతం చేశాడు.

   వైశాఖ పూర్ణిమా చంద్రుడు దివ్యంగా ప్రకాశిస్తూ ఉండగా అతనికి ప్రబోదము కలిగింది.   అ సమయంలో అతనికి ఆశ్రయం యిచ్చిన మహా వృక్షము బోది వృక్షమైంది. ప్రదేశం బుద్ధగయ ఐంది.  అతడు బుద్ధుడు అయ్యాడు.
       నలభైఐదు సంవంత్సరాల అనంతరం మళ్లీ అది ఒక వైశాఖ పూర్ణీమా దివస్దం.  అతడు బుద్దుడు ఐన తరువాత వర్షాకాలాల్లో తప్ప మిగతా అన్ని కాలాల్లో దేశవిదేశాల వెంట తిరుగుతూ బౌద్ధమత సిద్ధాంత ప్రచారం చేస్తూ వచ్చాడు.  కాని ఇప్పుడు అతదు బాగా వృద్ధుడు అయ్యాడు.  తన చరమకాలాన్ని అతడు పాటలీ పుత్రం వైశాలిమున్నగు నగరాల్లో కాక ఒక పల్లెపట్టున గడపాలనుకున్నాడు. ఆనందుడు అనే ముఖ్య శిష్యునితో కలసి అతడు ఒక సాలవృక్షాల అరణ్యంలోకి వెళ్లాడు.  అక్కడ ఆనందుడు రెండు సాలవృక్షాల నదుమ కొమ్మ్లలతో ఒక చిన్న మంచంతయారు చేశాడు.  అక్కడే బుద్ధుడు నిర్యాణం చెందాడు.  ఆప్రదేశం కుసివర అనే ప్రఖ్యాతి నందింది.
 లుంబిని వనంలో సాలవృక్షచ్చాయలలో వైశాఖ పూర్ణీమనాడు అతని జననం.
    గయలో మఱ్ఱిచెట్టుక్రింద విఅశాఖపూర్ణీమనాదు ఈతడు బుద్ధుడు అయ్యాడు.
   కుసినగ గ్రామంలో సాలవృక్షాల క్రింద వైశాఖ పూర్ణీమనాడు అతని నిర్యాణం
   బుద్దుని జీవితంలో ఇవి ముఖ్యఘట్టాలు.  ఈ మొడు ముఖ్యఘట్టాల్లో ప్రదేశాలు మారాయి.  చేట్లుమారాయి.  తిధి మాత్రం మారలేదు.
  అందుచేత వైశాఖ పూర్ణిమ భౌద్దులకు మహా పర్వమై ఉంది.  గౌతముని బుద్ధునిగా చేసిన బోధి వృక్షము పూజా భాజనమైంది.
   వైశాఖ పూర్ణిమనాడు బోది వృక్షానికి పూచేసే ఆచారం బుద్దుని జీతిత కాలంలోనే ప్రారంభమైంది.
   జేతవన విహారంలో బుద్ధుడు మకాము చేసి ఉన్న రోజులలో ఒకనాడు