పుట:PandugaluParamardhalu.djvu/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దక్షిణ దేశంలో నృసింహజయంతిపర్వ సందర్భంలో దీపోత్సవాలు జరుగుతాయి. ఊరేగింపులు చూడతగ్గవి. హంపిలోని దేవాలయం చాలా గొప్పది. జయపుర సంస్థానంలో ఖండేలా అనే చోట పన్నేండు చేతులు గల అపూర్వ నృసింహ విగ్రహం కలదు.

  మధుర అయోఢ్యనగరాల్లో నృసింహలీల అనే ఉత్సవం జరుగుతుంది.  మాళవదేశంలో ఊరేగింపు                                 -వ్రతోత్సవ చంద్రిక

విధ్యుక్త నృసింహ జయంతిని జరపడం వల్ల సకలపాపాలు, సమస్తగ్రహ బాధలు తొలగిపోతాయి. వైష్ణవులు ఈనాడు సాయంకాలం వరకు ఉపవాసం ఉంటారు. నృషింహస్వామిని పూజించిన రాత్రి విందు భోజనాలు, పానకము నరసింహస్వామికి ప్రియమైన నివేడన.

   తప్తహాటక కేశాంత జ్వలత్పావకలోచన
   వజ్రాధికన స్పర్శ దివ్యసింహ సమోస్తుతే
                         వైశాఖశుద్ధ పూర్ణిమ

 ఇరవైయేడు నక్షత్రాలలో విశాఖ అదహారోది.  విశాఖ అయిదు నక్షత్రాల కూటమి. అది కుమ్మరి సారలాగున ఉంటుంది.  విశాఖకు కాంతిని వ్యాపింప చేసేది అని అర్ధం. అట్టి వొశాఖ నక్షత్రంతో కూడిన పున్నమకు వైశాఖి అనిపేరు.  ఏమాసంలో వైశాఖి పూరెణిమ వస్తుందో ఆమాసానికి వైశాఖ మాసమని పేరు. వైశాఖిని మాహావైశాఖి అని గొప్పగా చెబుతారు.
     వైశాఖ పూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలి.  అదిఆఘనాశనిగా ఉంటుంది.  ఈనాడు ధర్మరాజు ప్రీతిని కొరి నానావిధ దానాలు చేయాలని ఈనాడు చేసేదానాలు అనంత ఫలాన్ని ఇస్తాయని తిధితత్వము చెబుతూ ఉంది.  ధర్మరాజు ప్రీతి కొరకు ఈనాడు నానావిధ దానాలు చేయాలని స్మృతికౌస్తుభము.
   ఈనాడు బుధ్దజన్మ మహోత్సవమని నీలమత పురాణము చెబుతున్నది.
      మహావైశాఖీ పుణ్యదినాన మహోదధిలో స్నానం చేసి పురుషోత్తమ దర్శనం చేస్తే కోటి జన్మాలలోని పాపం పోతుందని, గంగాద్వారే సిశిష్ట ఫలదా అనీ అంటారు.
   ఈనాడు సోమవరతం చేస్తారని సతుర్ఫర్గ చింతామణి. ఈనాటి