పుట:PadabhamdhaParijathamu.djvu/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అద్దు_____అధా 61 అధి______అధీ

అద్దు పద్దు.

  • అదుపు ఆజ్ఞ. జం.
  • "అద్దూ పద్దూ లేక వా డీమధ్య మితిమీఱి పోతున్నాడు." వా.

అద్దు ముద్దు

  • ముద్దు ముచ్చట. జం.
  • "అద్దుముద్దు మీఱి యాడది మగ డంచు, గుడిమాడి యాడ జూడ దలచి." రాధి. 3 ఆ.

అద్దెకు తిప్పు

  • అద్దెకు ఇచ్చు.
  • "వాడు ఉన్న నాలుగు ఇళ్లూ అద్దెకు తిప్పుతూ జీవిస్తున్నాడు." వా.

అద్భుత పడు

  • ఆశ్చర్యపడు.
  • "అశ్వము గొం చుడువీధి నేగ నద్భుతపడి." జైమి. 2. 29.

అద్వైతము

  • చాదస్తము.
  • "వాడి దంతా ఒట్టి అద్వైతం." వా

అధవా.

  • ఒక వేళ.
  • "వసుమతిపై నధవా నన్ను బుట్టింప నూహ కల్గెనేని." వరాహ. 2. 156.
  • "నీవు వస్తే మంచిది. అధవా ఏకారణం వల్ల యినా నువ్వు రాలేక పోతే మీ వా ణ్ణయినా తప్పకుండా పంపించు." వా.

అధాయకుడా విధాయకుడా ?

  • వాడికి చెప్పి ఏమి ప్రయోజనం? వా డిందులో చేయ గలది యేమి కలదు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "వా డేమి అధాయకుడా ? విధాయకుడా ? వా డేమంటే నేమి? వా.

అధిక ప్రసంగము చేయు

  • అనవసరముగా జోక్యము కలిగించుకొని మాట్లాడు.

అధిక ప్రసంగి

  • వాచాలుడు.
  • చూ. అదనప్రసంగి.

అధిక మాసము.

  • సూర్యుడు ఒకే రాశిలో ఉండగా రెండు చాంద్రమాన మాసము లారంభ మైతే తొలిది అధికమాసం. రెంటికీ ఒకేపేరు ఉంటుంది.
  • అధికచైత్రము, నిజచైత్రము ఇత్యాదులు.

అధికాచమానం

  • బహిర్దేశమునకు వెళ్లుట వైదికుల పరిభాష.
  • చూ. అల్పాచమానం.

అధివాసరము

  • తద్దినానికి ముందునాటిరాత్రి ఉపవసించుట. దీనినే అతివాస మనీ వాడుకలో అంటారు.
  • (రూపం) అతివాసము.

అధీతి బోధాచరణ ప్రచారణములు

  • చదుట, ఇతరులకు చెప్పుట, ఆ ప్రకారం ఆచరించుట, వానిని అనుసరించ మని యిత