పుట:PadabhamdhaParijathamu.djvu/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అద్ధా_____అన 62 అన_____అన

  • రులలో ప్రచారము చేయుట.

అద్ధాన్నం.

  • ఇది కోస్తాజిల్లాలలో వినిపించే రూపం.
  • చూ. అధ్వాన్నం.

అధ్వాన్నం

  • దిక్కు మాలినది, పాడుది.
  • "డించిపోవ దగవా యధ్వాన్న పుం బట్టునన్." హర. 3. 86.
  • ఈ అధ్వాన్నం అనేక రకాలు గా ఉపయోగిస్తారు.
  • "ఈ పుస్తకం చాలా అధ్వాన్నంగా ఉంది."
  • "తండ్రి చాలా కష్టపడి సంపాదించి పోయిన ఆస్తి నంతా వాడు నాలుగు రోజులలో అధ్వాన్నం చేసి పారేశాశు."
  • "ఎందుకు రా ఈ అధ్వాన్న పుబతుకు." వా.

అనంతశ యనం

  • పాడె.
  • అంతము లేనిశయనము కనుక.

అనక్షరకుక్షి

  • చదువు రానిమొద్దు.
  • చూ. నిరక్షరకుక్షి.

అనగా అనగా

  • తెలుగునాట ప్రతి జానపద కథా అనగా అనగా అన్న పలుకుబడితో ప్రారంభం కావడం అలవాటు.
  • అనగా అనగా ఒక ఊరు, అనగా అనగా ఒకరాజు - అన్నట్లు.

"అనగా ననగా నొకపుర
మొనరుం జంద్రవతి యనగ."
                   శుక. 1. 171.

అనగి పెనగి

  • అన్యోన్యముగా-కలసి మెలసి.
  • "అరమరలు లేనికూరిమి ననగి పెనగి." పారి. 1. 94.

అనగిపెనగి యుండు

  • స్నేహముగా కలసి మెలసి యుండు.

అనగ్ని దగ్ధుడు

  • నిప్పు పెట్టినా కాలనివాడు.

అనధ్యయనం

  • చదువగూడని రోజు.
  • చతుర్దశి, పూర్ణమ లేక అమాస్య, ప్రతిపత్తులలో వేదాధ్యయనం చేయరా దని శాస్త్రం. అష్టమి కూడా వీనిలో చేర్చుట కలదు.
  • (రూపాం) అనధ్యాయం.
  • చూ. శిష్టానధ్యాయం.

అనబట్టదు

  • 1. ఏమీ అన లేము.
  • "అనబట్టదు లోకములోన నిట్టి వేసవి గలదే?" కుమా. 6. 138.
  • 2. ఇలా అని చెప్ప వీలులేదు.
  • "అయ్యో! మాసంసారం ఇట్లా అనబట్ట దమ్మా!" వా.