పుట:PadabhamdhaParijathamu.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదు____అదే 60 అద్ద____అద్ద

  • "వాడు ఎంత కటిక చీకటిలో అయినా అదురూ బెదురూ లేకుండా పోతాడు." వా.

అదురూ బెదురూ లేక

  • జంకూ కొంకూ లేక. జం.
  • "వాడు అదురూ బెదురూ లేక అర్ధ రాత్రిలో ఆ అడివిలో నడచి పోతాడు." వా.

అదురుమనిషి

  • భయస్థుడు.

అదేం గగనం?

  • అ దేమి గొప్ప. అదేమి ఘన కార్యం?
  • "ఆ పుస్తకం ఒకరోజులో చదవడం అదేం గగనమా?"
  • "అదేం గగనం లెద్దూ." వా.

అదేం బంగారమా?

  • అంత విలువ కానిది అనుట.
  • "వాడు ఆ పుస్తకం చూచి యిస్తానంటే యియ్య లేదు. అదేం బంగారమా?" వా.

అదే పదివేలు

  • అంతమాత్రం చాలు. అదే గొప్ప.
  • "చేరిక నిచ్చి పాదముల జేర్పు డదే పదివేలు." పాణి. 6. 107.
  • "మీరు జాబు రాస్తే చాలు. అదే పదివేలు. రా నక్కఱ లేదు." వా.

అదే పనిగా

  • తదేక దీక్షతో.
  • "తిరిగితి మెల్ల దేశము లదే పనిగా." నానా. 83.

అద్దంతరపు సిరి

  • నడమంత్రపు సిరి.
  • కొత్త. 14.

అద్దపునీడ

  • అశాశ్వతము.
  • తాళ్ల. సం. 5. 311.

అద్దము చూచు

  • ముకురవీక్ష చేయు.
  • వేశ్యలకు కన్నెరికం పెట్టే ముందు అద్దం చూపించడం అనేది ఒక ఆచారం.
  • "పుష్యనక్షత్రమునందు నీయనుగు గాదిలికూతురు చూచు నద్దమున్."
  • క్రీడా. పు. 62.

అద్దములాగ

  • పరిశుభ్రంగా, మినమినలాడు నట్లుగా.
  • "వాళ్ల యిల్లు అద్దంలాగ ఉంటుంది. పాలు పోసి పాలు ఎత్తుకో వచ్చు." వా.

అద్దములోని ముడుపు

  • వట్టి దనుట.
  • అద్దములో ప్రతిఫలించినడబ్బు తీసుకొనుటకు రాదు కదా. తె. జా.

అద్దములో నీడ కాసపడు

  • అలభ్యమునకై వేకారు.
  • "బుద్దులు తప్పె నేమిటికి బోయిన నీళ్లకు గట్టవెట్ట నీ, యుద్దములోని నీడ కెటు లాసపడం బొసంగుం దలోదరీ." ఉ. హరి. 5. 157.