పుట:PadabhamdhaParijathamu.djvu/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అది_____అదీ 59 అదు_____అదు

అదిశం

  • విచిత్రం, వింత, అరుదు. ఇది 'అతిశయం' మారి వచ్చినపలుకుబడి.
  • దక్షిణాంధ్రంలో ప్రచురంగా వినిపించేపలుకుబడి.
  • "వా ళ్లేదో ఆబిడ్డను అడుగు కింద పెట్టనీయకుండా సాకుతున్నారు. మహా అదిశంగా వీళ్లకే పిల్ల ఉన్నట్టు."
  • "అదేం అదిశ మమ్మా! పిల్లను అత్త వారింటికి పంపడానికి అంత యిదయి పోతున్నారు." వా.

అది సంపాయిస్తున్నది

  • ఒడ లమ్ముకొని డబ్బు చేసుకుంటున్నది అనుట.
  • చిత్తూరుజిల్లాలో ఇది యెక్కువగా వినవస్తుంది.

అది సుత

  • అది మొదలు.
  • నాయకు. పు. 9.

అదీ ఒక గొప్పా

  • గొప్ప కా దనుట.
  • "భండనమందు నాకు నొక పాండవు లెంతటివారు." పాం. విజ.
  • "వా డేదో నాలుగుపద్యాలు రాశాడట. అదీ ఒక గొప్పే?" వా.

అదీ ఒక తప్పా?

  • "ఆయన బజారులో వెడుతూ ఉంటే నేను అరుగుమీదినుంచి లేవలే దట. అదీ ఒక తప్పా? వాడితో అన్ని మాట లన్నా డట."
  • "వా డేదో పద్యాలు వినిపించాడు. సరే. విన్నాను గదా. తా నేదో కాళిదాసును మించిపోయాడు అని నే నన లే దట. అదీ ఒక తప్పా? వాడు నన్ను దు మ్మెత్తిపోస్తున్నాడు." వా.
  • చూ. అది నేరమా?

అదును బదును

  • ఆనుపాను. జం.
  • "అదనుం బదను నెరింగి అండ నుంటే చాలు." తాళ్ల. సం. 3. 582.

అదుపు ఆజ్ఞ

  • కట్టుబాటు. జం.
  • "వాడు ఈమధ్య బొత్తిగా అదుపూ ఆజ్ఞా లేక తిరుగుతున్నాడు." వా.

అదురుగుండె

  • భయస్థుడు.
  • "వాడు వట్టి అదురుగుండె. ఒంటరిగా ఒంటికి కూడా పోలేడు." వా.

అదురుగుండె, పిక్కబెదురు లేమి

  • నిర్భీకత్వము.
  • "మేర మీఱు సంఖ్య మెఱయుదు రవ్వీట, నదురుగుండె పిల్ల బెదురు లేక." రంగా. 1. 18 పే.

అదురుతిక్క

  • ఒక పశురోగం.
  • "ఉంగిడి, యదురుద్రిక్క యనువానికి నా పేరు సెప్పినం జాలు."
  • భార. విరా. 1. 286.
  • "నరిడి పప్ప కప్ప నావురు కడుపూద, యదురుద్రిక్క యనగ నడరి మరియు, దెవులు లెన్ని యేని దవిలి యంతయు మహో, గ్రంబు లయ్య బశుగణంబు నందు." హరి. పూ. 6. 46.

అదురు బెదురు

  • భయము. జం.