పుట:PadabhamdhaParijathamu.djvu/855

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జమా - జము 829 జము - జయ

టకై కరణాల నందరినీ చేర్చి తాసీల్దారు జరిపే తతంగం.

జమాబంది సిరాబుడ్డి

  • సమిష్టిది ; ఒక అడ్డీ ఆగీ లేనిది; ఒకరి అధికారం లేనిది; అతి వ్యభిచారిణి.
  • జమాబందీ జరిగేటప్పుడు కచ్చేరిలో ఆ తాలూకా రెడ్లు, కరణాలు అందరూ చేరతారు. అక్కడ ఉన్న సమష్టి సిరాబుడ్డిలో ఎవ రంటే వారు కలం ముంచి రాస్తారు. అందుపై వచ్చిన పలుకుబడి.

జమీందారీ

  • ఒక జమీందారు క్రింద ఉన్న భూమి.
  • ఇప్పుడు జమీందారీలు రద్దయినవి.

జమీందారు

  • జమీందారీకి అధిపతి.
  • చూ. జమీందారీ.

జముకడకు చను

  • మరణించు.
  • "పాంచాలికొడుకు లందఱు జముకడకుఁ జనిరి." భార. సౌప్తి. 203.

జముదళము

  • నిడుపు పిడిగల బాకు.

జముదాడి

  • జముదళము.

జముదాళి

  • చూ. జముదాడి.

జమునిల్లు చొచ్చు

  • చచ్చు.
  • "జమునిల్లుఁ జొచ్చిన జంతువుఁ దెచ్చు, నమితసత్వాఢ్యు లీ యవనిలోఁ గలరె?" ద్విప. మధు. పు. 30.

జముబానసము నింటిత్రోవ చూపు

  • చంపు.
  • యముని వంటయింటదారిని చూపించుట అంతే కదా.
  • "రక్షగాఁ జుట్టి తిరిగెడురాక్షసులకుఁ, దొలుత జముబానసము నింటిత్రోవ చూపి." ఉ. హరి. 1. 139.

జములా గుడారాలు

  • డేరాలు. కాశీయా. 72.

జమువాకిలి గట్టు

  • బ్రతికించు.
  • యముని వాకిలిని మూయుట అనగా చావనీ కుండుట.
  • "మద్గృహంబునన్, వాడిమితోడ నుండి జమువాకిలి గట్టి మదీయ సంతతిన్." ఉ. హరి. 2. 19.

జమ్ముగూడ

  • జంబుతో అల్లిన గూడ. ఆము. 4. 133.

జమ్ముదాడి

  • చూ. జముదాడి.

జయ పెట్టు

  • జయజయ అని జేకొట్టు.
  • చూ. జయవెట్టు.