పుట:PadabhamdhaParijathamu.djvu/856

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయ - జఱ 830 జఱ - జల

జయము జయము

  • రాజులను, దేవతలను చూచినప్పుడు అనుమాట.
  • "జయము జయము నీకు సంపంగిమన్న! నన్, దయఁ జూడు దక్షిణద్వారకాధీశ!" హేమా. పు. 68.

జయ వెట్టు

  • జయజయధ్వానములు చేయు.
  • "జయ వెట్టుఁ డిటు గూడ సా తెల్ల ననుచు..." పండితా. ద్వితీ. పర్వ. పుట. 291.

జరుగుడాట

  • రాతిపలకలమీదినుండి క్రిందికి జారుతూ ఆడుకొనే ఆట. శ. ర.

జరుగుడుబండ

  • పై ఆట కుపయోగించే బండ.

జరుగుబడి

  • చూ. జరుగుబాటు.

జరుగుబాటు

  • తిండికి, బట్టకు ఉండుట.
  • "వాడికి జరుగుబాటు కేం లోటు లేదు." వా.
  • "వాడిది బాగా జరుగుబా టున్న కుటుంబం." వా.

జఱజఱ యీడ్చు

  • ధ్వన్యనుకరణము.

జఱభిచెయ్వులు దాల్చు

  • గడుసరిచేతలు చేయు. వ్యభిచారిణుల చేష్టలు చేయు - ప్రస్తుతం.
  • "జఱభిచెయ్వులు దాల్చిరి జార కామినుల్." కుమా. 8. 101.

జఱభితనము

  • గడుసుతనము.
  • "అడవిలోనఁ దపమువడఁ బోదు ననునంత, జఱభితనము లెందుఁ గఱచి తీవు." కుమా. 6. 16.
  • మూర్ఖత్వము వంటి దని టిప్పణిలోనూ కోశాలలోనూ ఉన్నా అట్లా అనిపించదు. మేనక పార్వతితో అంటున్న మాట యిది.

జఱభులు

  • గడుసు వారు, పాపులు, దుష్టులు.
  • "కఱకంఠు శుద్ధ నిష్కల భక్తియుక్తి, జఱభుల కది యేల సమకూడు." బస. 7. 204.
  • "ఎఱిఁగితి మద్ది రయ్య తడ వేటికి గుఱ్ఱపుదొంగ వీఁడె యీ, జఱభునిఁ బట్టి చంపుఁ డతిసాధుమునీంద్రుఁడు వోలె నేత్రముల్, దెఱవక...బైసుక పట్టె...." భాగ. 9. 207.
  • "కొఱగాని జఱభుల కొయ్యనగాండ్ర." బసవ. 5.

జలకట్టె

  • ఒకానొక డేగ - సెలకట్టె.

జలక మాడు

  • స్నాన మాడు.

జలకము లాడు

  • స్నాన మాడు.