పుట:PadabhamdhaParijathamu.djvu/846

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జంగు - జంత్ర 820 జంత్ర - జంపు

జంగుబిల్లి

  • అడవిపిల్లి.

జంటిరైక

  • ఒక విధమయిన రవిక. రాధి. 1. 99.

జండా పీకివేయు

  • పరారి అగు.
  • "ఊరంతా అప్పులు చేసి తెల్లారేసరికి వాడు జండా పీకేశాడు." వా.

జండా యెత్తి వేయు

  • పరారి అగు.
  • చూ. జండా పీకి వేయు.

జంతపట్టు

  • పైరునడుమ కలుపు పోవుటకై దున్ను.

జంతమాటలు

  • మాయమాటలు.

జంతికచుట్లు

  • మురుకులు, ముచ్చాఱలు, మణుగుబూలు అని వేరువేరు ప్రాంతాల్లో వ్యవహరించే పిండివంట.
  • జిలేబి అని బ్రౌన్ - సరి అనిపించదు.

జంతికపుండు

  • అనేకరంధ్రా లేర్పడే కుఱుపు, సెలల కుఱుపు.

జంత్రగాడు

  • యంత్రం నడిపేవాడు.

జంత్రబొమ్మ

  • కీలుబొమ్మ, మాయలాడి.

జందెపువాటుగా

  • జందెము వ్రేలు వాటముగా.
  • "ఖడ్గంబుతో నొడిచి, తీసుక వాని జందెపువాటు గాఁగ." వర. రా. యు. పు. 337. పంక్తి. 13.

జందెములు త్రెంచుకొను

  • కోపముతో చేయు చేష్ట. జంధ్యాలు తెంచుకొని. సన్యాసి నై పోతా నని బెదరించే అలవాటుపై వచ్చిన పలుకుబడి.
  • "ఆసపడి యేమి కోరిన నాగ్రహించు, జందెములు ద్రెంచుకొని తద్ద్విజన్మ ఖలుఁడు." శుక. 4. 109.

జంపు నడపు

  • ఆలస్యము చేయు.
  • "నీ వేల జంపు నడపెదు, రావే మాఱాడ కిందు రాకేందుముఖీ!" విజ. 2. 18.

జంపు చెల్లు

  • ప్రాభవము, తన ఆనతి నడచు. చం. రా. 2. 24.

జంపుమాటలు

  • జాగు చేసే మాటలు. విజ. 1. 102.

జంపువలపుబేరము

  • కాలహరణము చేయు ప్రేమ. తాళ్ల. సం. 12. 145.