పుట:PadabhamdhaParijathamu.djvu/845

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చౌప - ఛత్ర 819 ఛస్తే - జంగి

చౌపదము

  • ఒక గీతి విశేషము.

చౌపుట

  • నాల్గు కాళ్ళతో కుప్పళించి దుముకుట.

చౌరు కొట్టు.

  • లొట్టలు వేస్తూ ఆస్వాదించు.
  • "విరులు సిగఁ దాల్చి కర్పూరవీటఁ జౌరు,కొట్టుచు." ఆము. 2. 73.
  • "గొంటు వక్కలు చౌరు గొట్టుచు నమలి." అష్ట. కల్యా. 2. 82. పు.
  • రూ. చౌరు గొట్టు.

చౌవంచ

  • అయిదు.
  • రూ. చవ్వంచ, చౌవంచి.

చౌవీధి

  • చౌకు.
  • రూ. చవువీధి.

చౌషష్ఠికళలు

  • అరవైనాలుగు విద్యలు.

చౌసాల

  • చతుశ్శాల.

చౌసీతిబంధములు

  • ఎనభై నాలుగు రతి బంధ విశేషములు.

ఛత్రచామరములు

  • గొడుగు, వింజామరము. జం.
  • పండితా. ప్రథ. పురా. పు. 290.

ఛస్తే....

  • ఎంత కష్టపడినా, ఏ మయినా. మాటా. 134.

ఛిన్నాభిన్నముగ

  • ముక్క చెక్కలుగా.

జంకించు

  • జంకునట్లు చేయు, బెదరగొట్టి పారద్రోలు.
  • "పాతకంబుల జంకించు బహువిధముల."

జంకె యొనర్చు

  • భయపెట్టు.

జంకె సేయు

  • భయపెట్టు.

జంగగొను

  • దాటు.

జంగనడ

  • అశ్వగతిలో భేదము.

జంగనడక

  • కాలు చాపి నడచు నడక. శ. ర.

జంగనడపు

  • చూ. జంగనడక.

జంగమురాలు

  • జంగము స్త్రీ.

జంగిలి కాయు

  • పశువులను కాచు.
  • "పసుల జంగిలికాయ పాలేరు దున్నఁ, గొఱ మాలి..." గౌర. హరి. ద్వి. 560-561