పుట:PadabhamdhaParijathamu.djvu/795

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెన - చెన్న 769 చెన్న - చెప్ప

చెనకి యాడు

  • కొట్టు.
  • "గొబ్బు గొబ్బునఁ జేతికి, నబ్బినకైదువులఁ జెనకి యాడినఁ జెనకుల్." కకు. 1. 181.

చెనటిప్రతిజ్ఞలు.

  • కఠినప్రతిజ్ఞలు. హరిశ్చం. పూ. 404. పం.

చెనటిమాటలు

  • వ్యర్థము లైన మాటలు.
  • "అనుచు వగచు పలుకు లాలించి భీష్మాది, యోధవరులలో సుయోధనుండు, చెనటిమాట లేమి వినియెద రనిన..." భార. భీష్మ. 2. 228.

చెనుపరిమాటలు

  • పల్లెటూరి మాటలు, మోటు మాటలు.
  • "చెదరినకేశముల్ చెనుపరిమాటలు, వికృతస్వరంబునువెలయఁ గలిగి." భాస్క. రా. బాల. 593.

చెన్నటి పోవు

  • వ్యర్థ మగు.
  • "మీరును నే విచారములు మిన్నక చేయక పెంపు మీఱ నా, చేరువ రండు గెల్చుటను శ్రీయును గీర్తియు ముక్తియున్ మృతిం, జేరురణప్రయత్న విధి చెన్నఁటిపోవునె..." హరి. ఉ. 10. 123.

చెన్నలరారు

  • ఒప్పు.
  • "శ్రీహరి మిత్రుఁ డీ కృతికిఁ జెన్నలరార నధీశుఁడు." రుక్మా. 1. 15.

చెన్నలరు

  • చూ. చెన్నలరారు.

చెన్నారు

  • చూ. చెన్నలరారు.

చెన్నుపడు

  • ప్రకాశించు.

చెన్నుపఱుచు

  • ప్రకాశింప జేయు. బ్రౌన్.

చెన్ను మిగులు

  • ఒప్పు. తారా. 2. 16.

చెన్ను మీఱు

  • ప్రకాశించు.
  • "తొడవు లూడ్చిన నైనఁ దొయ్యలి రూపుతోఁ, జిన్నపోయినపట్లు సెన్ను మీఱ." ఉ. హరి. 1. 57.

చెన్నె సలారు

  • ఒప్పు. హరి. ఉ. 2. 128.

చె న్నొందు

  • మనోహర మగు.
  • "మహిమఁ జెన్నొందు వైకుంఠమందిరంబు." భాగ. స్క. 2. 228.

చెప్పక చెప్పక

  • అనక అనక.
  • 'చెప్పితే ఇంకెవరి నైనా చెప్పాలి గాని వీణ్ణా' అను భావచ్ఛాయలో...
  • "చెప్పక చెప్పక పాండిత్యం విషయంలో వీణ్ణే చెప్పాలా? పొట్ట పొడిస్తే అక్షరం లేదు వీనికి." వా.