పుట:PadabhamdhaParijathamu.djvu/796

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్ప - చెప్ప 770 చెప్ప - చెప్పి

చెప్పక చెప్పు

  • నోటితో చెప్పకనే సూచించు. తనంతట బోధపడు.
  • "వచ:, ఖను లని యెల్లవారలకుఁ జెప్పక చెప్పె...." గుంటూ. ఉత్త. 38.

చెప్ప కూడ లేదు

  • చెప్పుటకు కూడా సాధ్యం కాదు. చెప్ప వీలు కాదు. కాశీయా. 2. 74.

చెప్ప గిప్ప రాదు

  • చెప్ప వీలు లేదు.
  • "చేతులయందము చెప్ప గిప్ప రాదు." విజయ. 1. 131.

చెప్ప జిట్టలు

  • వింతలు; చెప్పుటకు అలవి కానివి. అర్థ మింకనూ విచార్యము.
  • "ఇమ్మహాత్ముని తెఱంగుఁ జెప్పఁ జిట్టలు." భార. శాంతి. 2. 429.

చెప్ప జూపగ రాకుండు

  • అనిర్వర్ణనీయ మగు.
  • అపురూపము లయినవాని పట్ల ఉపయుక్త మవుతుంది.
  • "చెప్పఁ జూపఁగ రావు మక్కా సీమ వీ గుజరీ తివాసులు." శుక. 1. 222.

చెప్ప జూప రాని

  • అవాఙ్మానసగోచరు డైన
  • "చెప్పం జూపఁగ రాని లోకజనకున్ శ్రీకాళహస్తీశు." కా. మా. 4. 101.

చెప్ప పని లేదు

  • చెప్పవలసిన అవసరము లేదు.
  • "ఇదియ కొంత విస్తారంబు నొందఁ గలదది చెప్పఁ బని యేమి ప్రధానకథా భాగం బింతియె..." కళా. 5. 61.

చెప్ప రాదు

  • చెప్ప గూడదు.
  • "తన కది చెప్పరా దని పలుకుటయు." కళా. 4. 176.

చెప్పా లేదు చెయ్యా లేదు

  • చెప్ప లేదు. జం.
  • "చెప్పంగ లేదొండు చేయలే దొండు." బసవ. 3. 74.
  • "చెప్పా లేదు చెయ్యా లేదు. తెల్లవారి చూచేటప్పటికి వెళ్లి పొయ్యాడు. నే నెలా ఉండ మంటాను?" వా.
  • "చెప్పా చెయ్యాకుండా ఈ పని చేసేస్తే ఇక నేను చేయగల దే ముంది?" వా.

చెప్పి చూచు

  • 1. చెప్పు.
  • "సనకాదుల కంతయుఁ జెప్పి చూపనా, సచ్చరితుల్ సమస్తముని చంద్రులకున్ గరుణార్ద్రచిత్తు లై, యిచ్చిరి బ్రహ్మవిద్య." కా. మా. 2. 90.
  • "ఆయనతో ఈ సంగతి చెప్పి చూస్తాను." వా.
  • "నా విషయం ఆ అధికారితో ఒక మాట చెప్పి చూడండి."
  • 2. ప్రయత్నించి చూచు.
  • "నే నేమో చెప్పి చూస్తాను. వాడు వింటా డని నా కేమాత్రం నమ్మకం లేదు." వా.