పుట:PadabhamdhaParijathamu.djvu/791

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెట్టు - చెట్టు 765 చెట్టు - చెట్టు

చెట్టు గట్టు

  • స్థిరపడు - వర్ధిల్లు.
  • "పితృ దేవతలకు నంచితసత్రశాల యై, చెట్టు గట్టెను గయాక్షేత్రసీమ." జైమి. 1. 22.
  • రూ. చెట్టుకట్టు.

చెట్టు చేమ

  • చెట్లు. జం.
  • ".....చుట్టుపట్టుల నెందుఁ జెట్టు చేమ లేక యొప్పెడు నొక్క లీలా మహీధర శిఖరంబుపై నిల్చి...." ప్రభా. 3. 148.
  • "బెంగుళూరు ప్రాంతాలలో ఎటు చూచినా చెట్టూ చేమా ఎంతో బాగుంటుంది." వా.

చెట్టు దిగి వచ్చినట్టులు

  • ఊడి పడినట్లు, హఠాత్తుగా.
  • "చెట్టు డిగివచ్చునట్టులఁ జెంత నిలువఁ, జూచి లేచి నృపుండు సంస్తుతుల మ్రొక్కి." హంస. 1. 46.

చెట్టుదిమ్మరి

  • కోతి.

చెట్టు దొక్కి వచ్చు

  • గబగబా వచ్చు.
  • అదృష్టం కలిగే శకునంతో వచ్చు.

చెట్టునట్టు

  • కోతి.

చెట్టున పుడికినట్లు

  • కొయ్యతో బొమ్మ చెక్కి నట్లు.
  • చెట్టును చెక్కినట్లు.
  • "ఏ వేషము ధరియించిన, నా వేషము తనకు నంద మై యుద్ధాత్రీ, దేవుఁడు చెట్టునఁ బుడికిన, భావంబున నుండు రూపు ప్రాయము కలిమిన్." కాశీ. 7. 232.

చెట్టుపడు

  • మ్రాన్పడు, స్తంభించి పోవు.
  • "అట్టిరట్టు వినినప్పుడె చెట్టుపడి పుట్టిన కోపంబు పట్టఁజాలక." ఉత్త. రా. 6. 343.

చెట్టుపేరు చెప్పి కాయ లమ్ము కొను

  • వెనకటి గొప్ప చెప్పుకొని బ్రతుకు.
  • "ఇలా చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకొని తినడం ఎన్నాళ్లు సాధ్యం అవుతుంది." వా.

చెట్టుపేరు చెప్పి పండ్ల మ్ము కొను

  • చూ. చెట్టుపేరు చెప్పి కాయ లమ్ము కొను.

చెట్టుబిడారు

  • కోతి.

చెట్టు విడిచిన భూతము

  • ఒక చోట నిలువ నీడలేనిది. చెట్టు నాశ్రయించుకొని కొన్ని భూతా లుంటాయని ప్రతీతి. ఏ మంత్ర గాడో చెట్టునుండీ దానిని తరిమి వేస్తే అది ఎక్కడా నిలువ