పుట:PadabhamdhaParijathamu.djvu/760

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చివ - చివు 734 చివు - చీక

చివచివ లొదవు

  • అరమరిక లేర్పడు. రాధి. 4. 102.

చివు కంతయు బోయిన చేవ చిక్కు సమ్మతి

  • సారము మిగిలినట్లు.
  • తాలు పోగా గట్టిగింజలు తేలునట్లు అనుటవంటిది. మానుమధ్యలో చేవ ఉంటుంది. పైభాగమును చివ్వి వేయగా పడు పొట్టు చివుకు. అది పోగా చేవే మిగులుతుంది.
  • "అ,య్యతనుని చేతికత్తి చివుకంతయుఁ బోయినఁ జేవ చిక్కు స,మ్మతి..." హంస. 2. 138.

చివుక పిట్ట

  • ఒక జాతి గబ్బిలం. శ. ర.

చివుకపిల్లి

  • ఒక రకమైన పిల్లి. శ. ర.

చివుకు చివుక్కను

  • మనసు చివు క్కను. రాధి. 4. 102.

చివుకు చెదార మైన

  • బాగా శిథిల మైన.
  • "చివుకు చెదారపుం ధనువుఁ జీల్చుట కింత మదింప నేటికిన్." చం. రా. 3. 146.

చివుక్కున దాటు

  • దాటుటలోని ధ్వన్యనుకరణము.
  • ".....దరిమి చివుక్కున దాటు హరులు." కవిక. 2. 70.

చివుక్కున నెక్కు ధ్వన్యనుకరణము.

  • "నెక్కొను తమకంబున ముంగిసమ్రాని పైకిఁ జివుక్కున నెక్కి యబ్బక్క నక్క..." హంస. 1. 192.

చివ్వకు చే సాచు

  • కయ్యానికి కాలు దువ్వు.
  • "చివ్వకు చే సాఁప వలదు." కాశీ. 1. 109.
  • కాశీ. 6. 180.

చీ అనే పనులు

  • తప్పుడుపనులు.
  • ఛీ కొట్టించుకొను స్థితికి తెచ్చే నీచపు పనులు. మదన. శత. 67.

చీకటికండ్లు

  • వెలుతురు చూడగనే కుంచించుకొని పోవు కన్నులు.
  • "ఆ చీకటికండ్లవాడికి పిల్ల నెవరిస్తారు?" వా.

చీకటి చెట్టు

  • తమాలవృక్షం.

చీకటితప్పు

  • వ్యభిచారము.
  • "గౌతమఋషి కులాంగన నహల్యాదేవిఁ, జీఁకటితప్పు జేసిన దురాత్మ." వరాహ. 2. 156.