పుట:PadabhamdhaParijathamu.djvu/759

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిల్ల - చిల్ల 733 చిల్ల - చివ

చిల్లకట్టె

  • ఒక పిల్లల ఆట. నేటి రూపం చిల్లాకట్టె.

చిల్లకోల

  • ఒక ఆయుధం - బాణము.

చిల్ల తర్కములు

  • చిల్లరవాదములు.
  • కుతర్కములు, వ్యర్థవాగ్వాదములు. కుమా. 8. 136.

చిల్ల పెంకు మాత్రము

  • విలువ లేనిది.
  • "నా కనఁగాఁ గనకము భా,మా! కనుఁగొనఁ జిల్లపెంకు మాత్రము దానిన్..." శుక. 1. 520.
  • చూ. గవ్వ చేయనిది. గుడ్డిగవ్వ చేయనిది.

చిల్ల పెంచాదిగా

  • పూర్తిగా.
  • చిల్ల పెంకు కూడా వదల కుండా అనుట.
  • "తన యింటి యావత్తు ధనమును మున్ను, సంచితం బగువస్తుసమితియుఁ జల్ల, పెంచాదిగా మట్టగించి తెప్పించి." బసవ. 3. 64.

చిల్ల మడ్డి

  • ధూపద్రవ్యము.

చిల్లరకాడు

  • సామాన్యుడు. శ. ర.

చిల్లరపబ్బములు

  • చిన్న చిన్న శుభకార్యములు.
  • "చెలియలి పెండ్లి చేసితిరి చిల్లర పబ్బము లెన్ని యైన శో,భిలె నను నెన్నఁ డైనఁ బిలిపించితిరే?" శుక. 2. 521.

చిల్లరవారు

  • అల్పులు, తక్కువ కులాలవారని పూర్వం అలవాటు. భాస్కర. 75.

చిల్లరవెచ్చములు

  • పప్పు బియ్యము మొదలయినవి.
  • "చిల్లర సామాను అని రాయలసీమలో వాడుక.
  • "ఎల్లుండి సమారాధన, చిల్లర వెచ్చములు గొనఁగ శీఘ్రమె యిదె యీ, పల్లియ సంతకు..." శుక. 2. 183.

చిల్లు పొల్లు సేయు

  • ధ్వంస మొనర్చు. కృష్ణ. 3. 30.

చిల్లులు పుచ్చు

  • బెజ్జాలు పెట్టు.

చిల్లులు వోవు

  • రంధ్రములు పడు.
  • "చిటిలిన విస్ఫులింగములఁ జిల్లులు వోయె నభ:స్థలంబు." శివ. 1. 90.

చివ చివగా

  • గబగబా.
  • "చివచివన్ రెం డడుగు లెదు రెక్కి." కళా. 8. 95.