పుట:PadabhamdhaParijathamu.djvu/752

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిప్ప - చిప్ప 726 చిప్ప - చిమ

అంటూ సొంటూ లేకుండు.

చిప్ప ఎత్తుకొని పోవు

  • ఉన్న దంతా పోగొట్టుకొని దిక్కు మాలినవా డగు. అడుక్కు తింటూ పోవు.
  • "వా డిలాగే ఖర్చు పెట్టుతూ వస్తే ఆఖరుకు చిప్ప ఎత్తుకొని పోతాడు. అప్పుడు గాని తెలియదు." వా.

చిప్పకత్తి

  • చెట్లకొమ్మలు నరికే మోటు కత్తి.

చిప్పకసవు

  • చిప్పగడ్డి.

చిప్పకూకటి

  • చిన్నతనమున పెట్టుకునే చిన్న జుట్టు.
  • "చిప్ప కూఁకటుల నాశ్రీరామచంద్రుఁ, డొప్పనే పట్టి దైత్యులఁ గూలఁ ద్రోయ." వర. రా. బా. పు. 77. పం. 52.

చిప్పగడ్డి

  • చిప్పకసవు.

చిప్పగుద్దలి

  • ఒకరక మైన గొడ్డలి.

చిప్పగొడ్డలి

  • చూ. చిప్పగుద్దలి.

చిప్ప చేతికి వచ్చు

  • ఉన్నది పోగొట్టుకొని నిరాధారు డగు.
  • "ఏదో పేరు రావాలని రెండుచేతులా ఖర్చు పెట్టాడు. చివరికి చిప్ప చేతికి వచ్చింది." వా.

చిప్పముత్తెము

  • మాయముత్యము.

చిప్పమూతి

  • చిప్పవలె ఉండే ముఖము. శ. ర.

చిప్పయమ్ము

  • ఒకరక మైన చిప్పవంటి బాణము.
  • "త్రుంచెఁ జిప్పయమ్ముల నది.... విజయుండు." భార. అశ్వ. 4. 8.

చిప్పలు వాఱ నొగ్గు

  • ప్రాధేయపడు.
  • "చిప్పలు వాఱ నొగ్గుటలుఁ జెల్లఁగ." భాస్క. యుద్ధ. 712.

చిప్పా దొప్పా సిద్ధము చేయు

  • సన్యాసమునకు సిద్ధపడు.
  • "ఆ పిల్ల కోడలుగా వస్తే నేను చిప్పా దొప్పా సిద్ధం చేసుకో వలసిందే." వా.

చిప్పెణక

  • ఇంటిపార్శ్వముల కప్పు. బ్రౌన్.

చిప్పెవాడు

  • దర్జీ. ఆం. భా. ద్వి. 282.

చిమచిమ అను

  • పుండు, గాయములాంటివి మంటపెట్టు.
  • "మొనపంట మొనసి నొక్కిన నొక్కుచేఁ గెంపు,టధరంబు చిమచిమ యనినయట్లు." అని. 2. 71.