పుట:PadabhamdhaParijathamu.djvu/753

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిమ - చిమ్మ 727 చిమ్మ - చిమ్ము

 • "ఏమిటో కట్టెచీమ కరిచిం దేమో? చిమచిమ లాడుతూ వుంది వ్రేలు." వా.

చిమచిమ లాడు

 • గాయం పుండుమొదలైనవి మంటపెట్టు.
 • చూ. చిమచిమ అను.

చిమడ బెట్టు

 • 1. ఉడికించు; కలతపెట్టు.
 • "చింతచే నీ మనసు చిమడఁ బెట్టేవు." తాళ్ల. సం. 3. 271.
 • 2. అన్నం మెత్తబడిపోవు నట్లు చేయు.
 • "ఏమిటే అన్న మిలా చిమడ బెట్టావు? దీనికంటే సంగటి నయం." వా.

చిమిడిపడు

 • ఉడుకు, బాధపడు. ద్వా. 5. 142.

చిమ్మచీకటి

 • కటిక చీకటి. కాశీ. 5. 101.
 • "కమ్మ విల్తుని యల రమ్ములం జిమ్మ చీఁకట్లు గ్రమ్ముటం జేసి." కా. మా. 2. 25.
 • "చిమ్మ జీఁకటిన్." నైష. 3. 150.
 • రూ. చిమ్మజీకటి.

చిమ్మట జిఱ్ఱనగా

 • ఏ మాత్రం శబ్దం అయినా.
 • "చీమ చిటుక్కు మన్న విను జిన్నట జి ఱ్ఱన నేఁగునంతలో." హంస. 3. 40.

చిమ్మటతార

 • ఒక సుషిరవాద్యం.

చిమ్మదిరుగు

 • గిరగిర తిరుగు.
 • "చిమ్మ దిరుగుచు నిలువక శిరము వ్రాల." భాగ. 10. పూ. 225.

చిమ్మనగ్రోవి

 • 1. నీళ్ళు చిమ్ము గొట్టము. వసంతం అవీ ఆడుటలో ఉపయోగిస్తారు.
 • పిచికారు.
 • 2. ఒక పిల్లల ఆట.

చిమ్మన చిల్లలు

 • పిల్లల ఆటలో ఆడే కర్ర ముక్కలు. చిల్ల, కట్టె ఆటల్లో నేటికీ వినిపించేమాటలు.

చిమ్మనపుగ్రోవి ప్రభా. 2. 81.

 • చూ. చిమ్మనగ్రోవి.

చిమ్మి రేగు

 • చెల రేగు, విజృంభించు ఇత్యాది భావచ్ఛాయలలో.
 • "చిందు లాడుదు మని చిమ్మి రేఁగుటయు." వర. రా. సుం. పు. 87. పంక్తి. 15.

చిమ్మి రేచు

 • చెలరేగునట్లు చేయు.
 • "సిగ్గరి కాంతల నింత చిమ్మి రేతురా." తాళ్ల. సం. 3. 110.

చిమ్ముబిల్లలు

 • చూ. చిమ్మనబిల్లలు.

చిమ్ముఱాయి

 • ఒక పిల్లల ఆట.