పుట:PadabhamdhaParijathamu.djvu/751

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్న - చిన్నా 725 చిన్నా - చిప్పం

లేదు. అయినా వాడికి కోపం వచ్చింది." వా.

  • చూ. మాడెత్తు మాట. చిన్న మెత్తు పనిలేదు.

చిన్నవాడు

  • బాలుడు.
  • "ననుఁ జిన్నవాఁ డని గడుప కిపు డుపన్యసింపుము." చెన్న. 1. 32.

చిన్న వోవు

  • అవమానముతో క్రుంగు.
  • "పోయె బాలుండు యదువృష్ణిభోజబలముఁ, జిన్న వోయెను జూడ వచ్చిన జనంబు." ఉ. హరి. 2. 28.
  • "చిన్ని మలయానిలంబులుఁ జిన్నవోయె." హర. 3. 89.
  • వాడుకలో - 'నే నీమాట అనగానే వాడి మొహం చిన్నబోయింది' - అన్న విధంగా వినవస్తుంది.
  • "వాడు ఈ రోజు చాలా చిన్నబోయి నట్టు కనబడుతున్నాడు." వా.
  • చూ. చిన్న బోవు.

చిన్నా పెద్దా తారతమ్యం

  • చిన్న పెద్ద అంతరువు.
  • "వాడికి చిన్నా పెద్దా తారతమ్యం తెలియదు." వా.

చిన్నారి

  • చిన్న దైన.
  • "చిన్నారి మేనితోడ." రాధి. 1. 53.

చిన్నారి పొన్నారి

  • ము ద్దయిన. జం.
  • హర. 5. 56.

చిన్నారి పొన్నారి ప్రాయము

  • బాల్యము.
  • "కురులు కూఁకటితోడఁ గూడియుఁ గూడని, చిన్నారి పొన్నారి ప్రాయము..." రాజగో. 1. 13.

చిన్ని పువ్వు

  • 1. తలలో ధరించు ఒకవిధమైన యాభరణము.
  • "కుటిలాలకములమీఁదఁ జిన్ని పువు గుస్తరించు నచ్చుగ మణికర్ణిక." కాశీ. 6.
  • "అలికలభములు పైఁ దులతెంచు తని రేకు. లలకలఁ జిన్నిపువ్వై వెలుంగ." కుమా. 9. 126.
  • 2. నమస్కార విశేషం. హంస. 4. 213.

చిన్ని పూఱేకు

  • భూషణవిశేషం.

చిన్నె లాడి

  • విలాసిని.

చిన్నెలాడు

  • విలాసి.

చిప్పంటు నీరంటు లేకుండు

  • ఏమీ లేక పోవు.
  • చిప్పలో ఏదయినా వేసినప్పుడు, కాస్తయినా తగులుకొని ఉండడం, నీరు కుమ్మరించినా కాస్త నీరయినా అంటుకొని ఉండడం మామూలు. అది కూడా లే దనుట.