ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చిన్న - చిన్నా 725 చిన్నా - చిప్పం
లేదు. అయినా వాడికి కోపం వచ్చింది." వా.
- చూ. మాడెత్తు మాట. చిన్న మెత్తు పనిలేదు.
చిన్నవాడు
- బాలుడు.
- "ననుఁ జిన్నవాఁ డని గడుప కిపు డుపన్యసింపుము." చెన్న. 1. 32.
చిన్న వోవు
- అవమానముతో క్రుంగు.
- "పోయె బాలుండు యదువృష్ణిభోజబలముఁ, జిన్న వోయెను జూడ వచ్చిన జనంబు." ఉ. హరి. 2. 28.
- "చిన్ని మలయానిలంబులుఁ జిన్నవోయె." హర. 3. 89.
- వాడుకలో - 'నే నీమాట అనగానే వాడి మొహం చిన్నబోయింది' - అన్న విధంగా వినవస్తుంది.
- "వాడు ఈ రోజు చాలా చిన్నబోయి నట్టు కనబడుతున్నాడు." వా.
- చూ. చిన్న బోవు.
చిన్నా పెద్దా తారతమ్యం
- చిన్న పెద్ద అంతరువు.
- "వాడికి చిన్నా పెద్దా తారతమ్యం తెలియదు." వా.
చిన్నారి
- చిన్న దైన.
- "చిన్నారి మేనితోడ." రాధి. 1. 53.
చిన్నారి పొన్నారి
- ము ద్దయిన. జం.
- హర. 5. 56.
చిన్నారి పొన్నారి ప్రాయము
- బాల్యము.
- "కురులు కూఁకటితోడఁ గూడియుఁ గూడని, చిన్నారి పొన్నారి ప్రాయము..." రాజగో. 1. 13.
చిన్ని పువ్వు
- 1. తలలో ధరించు ఒకవిధమైన యాభరణము.
- "కుటిలాలకములమీఁదఁ జిన్ని పువు గుస్తరించు నచ్చుగ మణికర్ణిక." కాశీ. 6.
- "అలికలభములు పైఁ దులతెంచు తని రేకు. లలకలఁ జిన్నిపువ్వై వెలుంగ." కుమా. 9. 126.
- 2. నమస్కార విశేషం. హంస. 4. 213.
చిన్ని పూఱేకు
- భూషణవిశేషం.
చిన్నె లాడి
- విలాసిని.
చిన్నెలాడు
- విలాసి.
చిప్పంటు నీరంటు లేకుండు
- ఏమీ లేక పోవు.
- చిప్పలో ఏదయినా వేసినప్పుడు, కాస్తయినా తగులుకొని ఉండడం, నీరు కుమ్మరించినా కాస్త నీరయినా అంటుకొని ఉండడం మామూలు. అది కూడా లే దనుట.