ఈ పుట ఆమోదించబడ్డది
అగ్గి________అగ్గి 28 అగ్గి________అగ్ని
- "ఆ పుస్తకం ఇట్లా అగ్గి పెట్టరా."
- "అదేదో పని చేయమంటే అదంతా అగ్గి పెట్టాడు." వా.
- ఇది రాయలసీమలో వినిపించే పలుకుబడి. ఇదే కోస్తా ప్రాంతాలలో ;తగులవేయి' అన్న రూపంలో కానవస్తుంది.
- చూ. తగుల వేయు.
అగ్గి పెట్టె
- నిప్పుపుల్లల పెట్టె
అగ్గి బడు
- పా డగు.
- "ఏ మన నేర్తు మదీయభాగ్య మిట్లగ్గి బడగ జేసినమదాంధుని నంచు..."
- కా. మా. 2. 111.
- "నాపని యిట్లా అగ్గి బడింది. నా సంసారం యిట్లా అగ్గిబడింది. వా.
అగ్గిమీద గుగ్గిలం వేసినట్లు
- అమితంగా చెల రేగుపట్ల ఉపయోగించే పలుకుబడి. మండి పడు అనుట.
- అగ్గిమీద గుగ్గిలం వేస్తే భగ్గుమంటుంది. అందుపై ఏర్పడినది.
- "నీవూ కనిపించావా ఇక వాడు అగ్గిమీద గుగ్గిలం వేసినట్లే భగ్గుమంటాడు." వా.
అగ్గి మ్రింగు
- కోపపడు.
- "అగ్గి మింగుతున్నాడు. వాడి దగ్గరికి ఇప్పుడు పోవద్దు." వా.
అగ్గిరాముడు
- క్రూరుడు, కోపధారి.
అగ్గి రాలుస్తున్నవి (కండ్లు)
- కోపంతో ఎఱ్ఱగా ఉన్నవి.
అగ్గిలాంటి మనిషి
- చాలా శీలవంతు డనుట.
- "వాడు అగ్గి లాంటి మనిషి. డబ్బూ గిబ్బూ పే రెత్తావా నీపని అసలు కాదు." వా.
అగ్ని కణం
- మిణుగురు పురుగు.
అగ్ని చిత్తు
- అగ్ని చయనం చేసినవాడు.
అగ్ని దగ్ధుడు
- పాడయినవాడు.
అగ్ని మండలం
- పైరు కొట్టివేసే ఒక పురుగు, అది తగిలితే ఒంటి మీద బొబ్బలు పోతాయని అంటారు.
- "అది పైత్యం కాదు రా. అగ్ని మండలప్పురుగు సోకి ఉంటుంది." వా.
(అగ్ని)మలుగు
- ఆరిపోవు.
- "వెల సె వెలుగు గాని మలుగడు (అనలుడు)." కుమా. 9. 161.
అగ్ని మాంద్యం
- అజీర్ణ రోగము.
అగ్ని ముఖము
- జీడి.
అగ్ని ముఖుడు
- బ్రాహ్మణుడు, దేవుడు.
- "అగ్ని ముఖా వై దేవా:"