పుట:PadabhamdhaParijathamu.djvu/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అగ్గి________అగ్గి 28 అగ్గి________అగ్ని

  • "ఆ పుస్తకం ఇట్లా అగ్గి పెట్టరా."
  • "అదేదో పని చేయమంటే అదంతా అగ్గి పెట్టాడు." వా.
  • ఇది రాయలసీమలో వినిపించే పలుకుబడి. ఇదే కోస్తా ప్రాంతాలలో ;తగులవేయి' అన్న రూపంలో కానవస్తుంది.
  • చూ. తగుల వేయు.

అగ్గి పెట్టె

  • నిప్పుపుల్లల పెట్టె

అగ్గి బడు

  • పా డగు.
  • "ఏ మన నేర్తు మదీయభాగ్య మిట్లగ్గి బడగ జేసినమదాంధుని నంచు..."
  • కా. మా. 2. 111.
  • "నాపని యిట్లా అగ్గి బడింది. నా సంసారం యిట్లా అగ్గిబడింది. వా.

అగ్గిమీద గుగ్గిలం వేసినట్లు

  • అమితంగా చెల రేగుపట్ల ఉపయోగించే పలుకుబడి. మండి పడు అనుట.
  • అగ్గిమీద గుగ్గిలం వేస్తే భగ్గుమంటుంది. అందుపై ఏర్పడినది.
  • "నీవూ కనిపించావా ఇక వాడు అగ్గిమీద గుగ్గిలం వేసినట్లే భగ్గుమంటాడు." వా.

అగ్గి మ్రింగు

  • కోపపడు.
  • "అగ్గి మింగుతున్నాడు. వాడి దగ్గరికి ఇప్పుడు పోవద్దు." వా.

అగ్గిరాముడు

  • క్రూరుడు, కోపధారి.

అగ్గి రాలుస్తున్నవి (కండ్లు)

  • కోపంతో ఎఱ్ఱగా ఉన్నవి.

అగ్గిలాంటి మనిషి

  • చాలా శీలవంతు డనుట.
  • "వాడు అగ్గి లాంటి మనిషి. డబ్బూ గిబ్బూ పే రెత్తావా నీపని అసలు కాదు." వా.

అగ్ని కణం

  • మిణుగురు పురుగు.

అగ్ని చిత్తు

  • అగ్ని చయనం చేసినవాడు.

అగ్ని దగ్ధుడు

  • పాడయినవాడు.

అగ్ని మండలం

  • పైరు కొట్టివేసే ఒక పురుగు, అది తగిలితే ఒంటి మీద బొబ్బలు పోతాయని అంటారు.
  • "అది పైత్యం కాదు రా. అగ్ని మండలప్పురుగు సోకి ఉంటుంది." వా.

(అగ్ని)మలుగు

  • ఆరిపోవు.
  • "వెల సె వెలుగు గాని మలుగడు (అనలుడు)." కుమా. 9. 161.

అగ్ని మాంద్యం

  • అజీర్ణ రోగము.

అగ్ని ముఖము

  • జీడి.

అగ్ని ముఖుడు

  • బ్రాహ్మణుడు, దేవుడు.
  • "అగ్ని ముఖా వై దేవా:"