పుట:PadabhamdhaParijathamu.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అగు_________అగ్గ 27 అగ్గి___________అగ్గి

అగుగాములు

  • ఔగాములు, మంచి చెడ్డలు.

అగుబొమ్ము

  • సరే.
  • "అని చెప్పిన విని యగు బొ, మ్మని కైకొని." భార. విరా. 1. 114.

అగుడుపడు

  • నలుగురినోళ్లలో నాను.
  • "ఈపనులవల్ల, అగుడుపడిపోవడం తప్పి తే ప్రయోజనం యేమైనా ఉందా?" వా.

అగుడుబ్రతుకు

  • నలుగురినోళ్లలో నానుతూ ఉండే జీవితం.
  • "నీది ఒట్టి అగుడుబతుకు అయిపోయిందమ్మా!" వా.

అగులెమ్ము

  • కానిమ్ము.
  • వాడుకలో 'ఔలే.'
  • "దీని నెల్లిదముం జేసినజాడ దోచు నొకొ యౌ లె మ్మిందు నే నున్కి." పారి. 1. 54.

అగ్గము చేయు

  • పాల్పఱచు.
  • "మ మ్మంగజుపూవుదూపులకు నగ్గము సేసి." భాగ. దశ. పూ. 1011.

అగ్గల కెగురు

  • పై కెగురు.
  • "వాడు అగ్గల కెగిరి పోతున్నాడు." వా.

అగ్గలమీద పోతున్నాడు

  • మహావిజృంభణలో ఉన్నాడు. ఎవరినీ లెక్క పెట్టటం లేదు అన్న సందర్భంలో ఉపయోగిస్తారు.
  • "వా డెక్క డమ్మా! అగ్గలమీద పోతున్నాడు. మాలాంటి వాళ్ళం కళ్ళ పడతామా?" వా.

అగ్గి అయిపోవు

  • ఉగ్రుడగు.
  • "వాడు ఆమాట వినేసరికి అగ్గి అయి పోయినాడు." వా.

అగ్గి కక్కు

  • "వాడు అగ్గి కక్కు తున్నాడు." వా.
  • చూ. అగ్గి కురుస్తున్నాడు.

అగ్గి కురియు

  • కోపంతో ఉండు.
  • "వాడు అగ్గి కురుస్తున్నాడు. వాడిదగ్గరికి ఇప్పుడు పోవద్దు." వా.

అగ్గిపిండం

  • శీలవంతుడు, దగ్గరకు ఎవరినీ చేర నియ్యనివాడు, సాహసి.
  • "వాడా! అగ్గి పిండం. ఏమనుకున్నావో."
  • "నీ అల్లి బొల్లి కబుర్లన్నీ పనికిరావక్కడ. వాడు అగ్గిపిండం." వా.

అగ్గి పెట్టు

  • ని ప్పంటించు, అగ్ని సంస్కారము చేయు.
  • "వాడికి అగ్గి పెట్టేదిక్కు కూడాలేదు."
  • "ఆ ఊళ్లో వాడికి అగ్గి పెట్టారట." వా.
  • ఇదేమాటనే కోపంతో - ఏదో ఒకటిచేయి, పడవేయి అనే అర్థాలలో అంటారు.
  • "ఏదోఒకటి అగ్గి పెట్టు, తొందరగా ఆఫీసుకు వెళ్లాలి." వా.