పుట:PadabhamdhaParijathamu.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అగ________అగ 26 అగ__________అగు

  • "ఏదో అగతికంగా మీయింట్లో వచ్చి పడ్డా మని నోటికి వచ్చినట్లల్లా అనడం బాగులేదు."
  • "వా డేదో అగతికంగా అక్కడికి వెళ్లాడు." వా.

అగమ్యగోచరం

  • ఏమాత్రం అంతు చిక్కనిది.
  • "ఆ వ్యవహారం నాకు అగమ్యగోచరంగా ఉంది." వా.

అగలూ పొగలూ

  • గొడవగా, బాధగా.
  • "వాడిపని అగలూ పొగలుగా ఉంది." వా.

అగవుతగవులు

  • ఇచ్చిపుచ్చుకొనుటలు, మాట మర్యాదవంటిది. జం.
  • "అది విని చెలంగె మత్సతి యటుల గాదె, యల్లు డని యాడు బిడ్డని యగవు తగవు, లంపకము శుభశోభన మని యి వెల్ల, సంతసము జేయు గన్య కాజనము లకును." దశా. (బల) అ. 9. పే. 289.
  • "వధూటుల కల్లు డనుచు నగవు దగవు లటంచు సెయ్యంబు లంచు నంపకంబు లటంచు మరి యెన్ని యైన గలవు." కువల. 3. 65.

అగసాలె నిజము

  • నమ్మ రానిది.
  • స్వర్ణ కారులు సత్యము చెప్ప రనుటపై వచ్చినది.
  • రాధి. 4. 79.

అగస్త్యభ్రాత

  • పేరూ ఊరూ లేనివాడు. అనా మకుడు.
  • "వాడు ఒట్టి అగస్త్యభ్రాత. వాణ్ణి అడిగితే ఏం తెలుస్తుంది." వా.

అగస్త్యమంత్రం

  • జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ కడుపు తడుముకొను. అగస్త్యవాతాపుల కథపై వచ్చిన పలుకుబడి.
  • "కడుపు నిమిరికొంచు అగస్త్యమంత్రములు నొడివి." దశా. 2. 630.

అగాడీ పిఛాడీ తెంచుకొని

  • ఉచ్చులు తెంచుకొని పరుగెత్తు పట్లనే ఉపయోగిస్తారు.
  • పూర్వం గుఱ్ఱానికి వెనుకా ముందూ గుంజలు పాతి కట్టి వేసేవారు. వాటిని తెంచుకొని పరుగెత్తడంపై వచ్చినది.
  • "వాడు అగాడీ పిఛాడీ తెంచుకొని పరుగెత్తాడు. ఆ మాట వినగానే" వా.

అగాధము

  • అంతు పట్టనిది.
  • "ఆ వ్యవహారం అంతా అగాధంగా ఉంది." వా.

అగావుగా

  • అకస్మాత్తుగా.
  • సూ. ని.

అగు గాక

  • కానీ.