పుట:PadabhamdhaParijathamu.djvu/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏమి_____ఏమి 286 ఏమి_____ఏమి

  • "ఏమఱించి కృష్ణు డిండ్లలో జొరబడి, యున్న పాలు పెరుగు వెన్న నెయ్యి, కొల్లలాడుచుండ..." రాధా. 1. 19.

ఏమి అని అడిగేవాడు లేడు.

  • ఒకరికి సంజాయిషీ యివ్వవలసిన అవసరము లేదు అనుట.
  • "ఎచట నుండిన నింట నే మనువాడు లే, కింపు సొంపు ఘటిల్లునిల్లు గలిగె." శుక. 3. 600.
  • "ఆ యింట్లో వాడు ఏం చేసినా ఏమి అని అడిగేవాడు లేడు." వా.
  • అనగా వాడు సర్వస్వతంత్రు డనుట.

ఏమి ఒరిగింది?

  • ఏమి లాభం వచ్చింది?
  • "నామీద అంత దుష్ప్రచారం చేశావు క్దా? నీ కేం ఒరిగింది?" వా.
  • "నీకు చెరుపు చేస్తే నాకు ఒరిగే దేముంది?' వా.

ఏమి కట్టుకొనును?

  • దీనివల్ల వాని కేమి లాభము వచ్చెను?
  • దీనివల్ల వచ్చినలాభ మేమిటి? అనవసరంగా ఇతరులను బాధ పెట్టడం తప్పితే - అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • భార. ద్రో. 3. 295.
  • "కైక దీఅ నేమి కట్టుకొనియె." భాస్క. అయో. 199.
  • "వాణ్ణి నువ్వంతగా యేడ్పించి కట్టుకొన్న దేముంది?" వా.
  • "నన్ను చెఱిచి నువ్వేం కట్టుకొంటావు?" వా.
  • "అందర్నీ తిట్టి అదేం కట్టుకొంటుంది?" వా.

ఏమి కర్మమో!

  • అ దేం ఖర్మో - అదేం దురదృష్టమో.
  • "ఆమట పదిట లింగార్చకుం డనెడు, నామంబు వినరా ద దేమి కర్మంబొ?" బస. 6. 155/

ఏమి కొంప మునిగింది?

  • ఏమి పోయింది?
  • "వాడు రాకపోతే పోయాడు. ఏం కొంప మునిగింది." వా.
  • చూ. ఏమి మాడెను?

ఏమి గహనం?

  • అదెంత పని? అ దేం మహా ఘనకార్యం?
  • "నా కిష్టం బైనవరంబు...దివ్యాస్త్ర లాభం బనిన నది యేమి గహనంబు దానిన యిచ్చెద." భార. అర. 1. 293.
  • "అప్పని గైకొని నా కది యేమి గహనం బని." కుమా. 4. 52.
  • చూ. అదేం గగనం?

ఏమి చూచి (చూచుకొని)...

  • ఇలా ప్రవర్తిస్తున్నావు. అంతకు తగినకారణ మేదీ లేదే అనుట.
  • "ఏమి చూచుకొనో వాడు మహా మిడిసి పడుతున్నాడు." వా.