పుట:PadabhamdhaParijathamu.djvu/313

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఏమి_____ఏమి 287 ఏమి_____ఏమి

 • "ఏమి చూచి వాడికి పిల్ల నిమ్మంటారు?" వా.
 • "ఏమి చూచి నన్నింత చులకనగా చూస్తావో నాకు బోధపడడం లేదు." వా.

ఏమి చెప్పను?

 • ఏ మని చెప్పగలను. అనిర్వర్ణనీయ మనుట.
 • "...వాని భుజ ప్రతిభా విశేషముల్, మానిని యేమి చెప్ప నసమానము లౌను దదీయవైఖరుల్." హంస. 3. 15.

ఏమి చెప్ప పని యున్నది?

 • చెప్పవలసిం దేముంది?
 • ఇది అంత స్పష్ట మైన విషయం అన్న సందర్భంలో ఉపయోగిస్తారు.
 • "బలభేదన యేమి చెప్ప బని యున్న దికన్." నిరంకు. 4. 31.

ఏమిటి వారు

 • ఎవరు?
 • "సుతవైభవము నీవు చూడంగవలయు, నితరు లందఱు గూడ నేమిటివారు?" వర. రా. బా. పు. 204. పంక్తి. 15.

ఏమి తగవు?

 • ఏమి న్యాయం?
 • "విలయశిఖినేత్రుకడ కగ్ని, యేల పోవు బంపు డేమి తగవు?" కుమా. 9. 159.

ఏమి త్రవ్వి తల కెత్తినారు

 • వారు చేసిన మహా సహాయం ఏమిటి అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఏమి అటూ యిటూ కూడా మారవచ్చును. సాధించిన దేమిటి అన్న అర్థమూ కలదు.
 • "తమకు నేమి త్రవ్వి తలయెత్తిరమరు లీ, యుర్వి మనుజు లేమి యొసగ రైరి, నింగి వారసతుల నిర్మాతృకల జేసి, పుడమి మాతృభూతముల సృజించె." వైజ. 3. 22.
 • "నువ్వు ఇన్నాళ్లూ ఈఊళ్లో ఉండి త్రవ్వి తల కెత్తిం దేమిటి?" వా.

ఏమి దొడ్డు?

 • ఏమి గొప్ప ?
 • "విఖ్యాతమహాప్రతాపునకు నద్రిగుహాలయ మేమి దొడ్డు?" కా. మా. 3. 208.

ఏమి పుట్టునొ?

 • ఏ మవుతుందో - అనగా ఏదో అనర్థం కలుగ నున్న దని సూచించు పలుకుబడి.
 • "ఈయెడ నేమి పుట్టునొ సహింపగ రాదు విచార మంచు నా,థా! యిక నేమి..." శుక. 3. 150.

ఏమి పెద్ద!

 • అదేమి గొప్ప. సామాన్య మనుట. భార. అర. 3. 170.

ఏమి పొయ్యేకాలం?

 • ఇంత దుర్బుద్ధికి కారణం ఏమి అనుపట్ల ఉపయోగిస్తారు.
 • "వాడి కేం పొయ్యేకాలం? పెళ్లాన్ని వదిలిపెట్టడానికి?" వా.

ఏమి మాడెను?

 • ఏమి కొంప మునిగింది?