పుట:PadabhamdhaParijathamu.djvu/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉప్పూ_____ఉప్పో 218 ఉబ_____ఉబ్బ

  • "అద్దిరా! మీ యొడళ్లు మీ యొద్ద లేవు గదా! ఉప్పు లేక ముప్పందుము త్రాగుచు గద్దెపొంకములు చాల దిద్దగలరే?" ధర్మజ. 46. 14.

ఉప్పూ నిప్పూ

  • సహజవిరోధ మనుట.
  • "వాడికి వీడికి ఉప్పూ నిప్పూ. వాడూ వీడూ కలవడం ఎలా సాధ్యం?" వా.

ఉప్పెనబోవు

  • గంగ గలియు, వరదపాలగు.
  • "మ్రోల వచ్చినకల్పసాల ముప్పెన బోయె." కా. మా. 4. 111.

ఉప్పెనవలె

  • హఠాత్తుగా. వరద హఠాత్తుగా వస్తుంది.
  • "వాడు ఉప్పెనలా వచ్చాడు." వా.

ఉప్పొంగు

  • పొంగు.
  • "జలరాసు లేడు నుత్సవమున నుప్పొంగె." రుక్మాం. 1. 142.

ఉప్పొలికి ఇమ్మడి అయినట్లు

  • ఉప్పు క్రింద పోయి రెండింత లయినట్లు. నష్టము కల్గునట్టి పని జరుగగా, అందువల్ల లాభమే అగు.
  • పండి. ప్రథ. పురా. 387 పు.
  • చూ. ఉప్పు చిదిమి యినుమడి యగు.

ఉప్పో ఊరగాయో

  • ఉన్న దానిలో ఏదో ఒకటి. భోజనవిషయంలోనే ఉపయోగించే పలుకుబడి.
  • "ఉప్పో ఊరగాయో యేదో ఒకటి వేసుకు తింటే పోతుంది. అంత శ్రమ యెవడు పడతాడు?" వా.
  • "ఉప్పో ఊరగాయో మాకు కలిగింది లేదనకుండా పెడతాము. తినిపో నాయనా!" వా.

ఉబలాటపడు

  • ఒక కార్యమునకై యెక్కువగా ఉత్సహించు.
  • "వాడు ఆపిల్లను పెళ్ళి చేసుకోవా లని మహా ఉబలాట పడుతున్నాడు." వా.

ఉబుసుపుచ్చు

  • కాలక్షేపము చేయు.
  • "అతివ! యెపుడు నుబుసు పుత్తురు వివిధోపయోగ్యకళల." పారి. 2. 93.

ఉబుసుపోక

  • కాలక్షేపము. కబురులు చెప్పుకొనుట.
  • "ఉబుసుపోకకు నైన నొల్లపు చెవిజేర్ప, వైణికవల్లకీవాదనములు." వరాహ. 2. 56.
  • "జలరుహేక్షణ లుబుసు పోకల వసించి." విప్ర. 2. 65.
  • ఆముక్త 2. 74. మను. 4. 24.

ఉబుసుపోవు

  • కాలక్షేప మగు.
  • "ఉబుసుపోవంగ శివశర్మ యొయ్యం జేరె, నప్సరోలోకము." కాశీ. 3. 165.

ఉబ్బనీయకు

  • వెలికి తెలియనీయ వద్దు.
  • "ఈ కథయును నీకు నాతోడు సం మ్ముబ్బనీకు మనియె." కళా. 1. 194.