పుట:PadabhamdhaParijathamu.djvu/243

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉప్పు____ఉప్పు 217 ఉప్పు____ఉప్పు

ఉప్పుడుబియ్యము

 • వడ్లను ఉడకబెట్టి ఆరబోసి దంచినబియ్యము.
 • "ఉప్పుడుబియ్య< అన్నం త్వరగా జీర్ణమవుతుంది." వా.

ఉప్పు తిని ముప్పు తలచు

 • తిన్న యింటివాసాలు లెక్కించు.
 • "అలాంటివాణ్ణి మనం చేరదీస్తే యేం లాభం? ఉప్పు తిని ముప్పు తలచే రకం." వా.

ఉప్పు తిను

 • సొత్తు తిను, పోషింపబడు. ఉప్పు భోజనంలో ప్రధానమైనది కనుక అది భోజనానికే ప్రత్యామ్నాయ మైనది.
 • "తొంటిజని వాని యుప్పటు, తింటి జుమీ యింతపాటు దెచ్చుకొనుటకై." శుక. 3. 411.
 • "వాని ఉప్పు తిన్నాను. కష్టసుఖాల్లో వానితోనే ఉండడం న్యాయం." వా.

ఉప్పుతో తొమ్మిది

 • అన్ని పదార్థాలూ.
 • "ఉప్పుతో దొమ్మిదియును వెట్టి కృపణ రక్షణము గావించు నీగుణసముద్రుడు." రామా. 1. 107.
 • "ఉప్పుతో తొమ్మిదీ వాళ్లింటికి అత్తవారింటినుండి రావలసిందే." వా.

ఉప్పుపట్టీలు

 • చూ. ఉప్పనపట్టె లాడు.

ఉప్ప పట్టు

 • ఉప్ప దనము అంతటా వ్యాపించు.
 • "ముక్కలకు ఉప్పే పట్ట లేదే? ఇంకాసేపు ఉంచితే పోయేది." వా.

ఉప్పు పత్తిరి లేని

 • ఎందుకూ పనికి రాని, ఏమీ లేని.
 • "ఉప్పు పత్తిరి లేని యప్పు డవ్వారి శి,ష్యోపశిష్యులపోల్కె నుండవలయు." గీర. 30

ఉప్పు పత్రి

 • అడ్డూ ఆగీ. జం.
 • "ఆనోటికి ఉప్పూ పత్రీ లేదు." వా.

ఉప్పు పెఱిక

 • ఉప్పుసంచి.
 • "పోతుమీద నడ్డంబువడి యుప్పు పెఱికవోలె వెఱచె జముడు." కుమా. 2. 73.

ఉప్పున పాతఱ వేయు

 • శిక్షించు. పూర్వం వేసే శిక్షలలో ఉప్పులో ఊరవేయడం కూడా ఒకటి. అందుపై వచ్చినపలుకుబడి.
 • "చిత్రాంగిని తుదకు ఉప్పున పాతఱ వేశారు." వా.

ఉప్పుపఱ్ఱ

 • చవిటి నేల.

ఉప్పు లేక ముప్పందుము త్రాగు

 • వట్టి తిండిపోతురాము డగు. ఉప్పు లేనిదే రుచి యేమాత్రం ఉండదు. దానినే అంత త్రాగినప్పుడు రుచిగా ఉంటే యింక యెంత త్రాగునో!