పుట:PadabhamdhaParijathamu.djvu/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉబ్బ_____ఉబ్బి 219 ఉబ్బు_____ఉభ

ఉబ్బనీరు

  • ఉమ్మి.

ఉబ్బనెత్తు

  • పై కెత్తు.
  • "నీటిలో మునిగిననేలచేడియ గొమ్ము, కొన నుబ్బ నెత్తినఘోణి వీవ." పారి. 1. 49.

ఉబ్బర పోవు

  • సంతోషించు. ఉబ్బిపోవడ మంటే సంబరపడడ మన్నది నేటికీ అలవాటులో ఉన్నది.
  • "సూ,ర్యోదయ వేళ ముజ్జగము నుబ్బర పోవగ." కాశీ. 6. 17.

ఉబ్బరిక చేయు

  • విజృంభించు, అతిశయించు.
  • భాగ. 10. పు. 1345.

ఉబ్బవేయు

  • పొగడు. అది హృదయపూర్వకం కాదన్నధ్వనీ ఇందులో ఉన్నది.
  • "వాడు వాళ్ల అత్తను ఉబ్బవేసి తనపని గడుపుకొంటున్నాడు." వా.

ఉబ్బసపుచ్చు

  • ఆయాసపడు.
  • "నావుడు నుబ్బసపుచ్చును." ద్వాద. 2. 85.

ఉబ్బి తబ్బి బ్బగు

  • సంతోషపరవశు డగు. సంతోషమో, భావోద్రేకమో కలిగినప్పుడు శరీరం ఉప్పొంగడం కవులు గుర్తించినసత్యం. వీరునికి భుజములుప్పొంగుట యిలాంటిదే. ఒకప్పుడు ఎత్తిపొడుపుగా కూడా ఈ పలుకుబడి ప్రయుక్తం కావడం కలదు. ఇతరుల పొగడ్తకు ఉబ్బి తబ్బి బ్బవుతాడు అని వ్యవహారం. ఉబ్బవేయు యిలాంటిదే.
  • "దైవయోగంబువలన బ్రమాదం బని తలంపక రాజసన్మానంబునకు నుబ్బి తబ్బిబ్బుగా బచరించిన." శుక. 1. 186.
  • "ఆయన కావ్యంనుండీ ఒక పద్యం ఉటంకించేసరికి ఉబ్బి తబ్బి బ్బయి పోయినాడు." వా.

ఉబ్బుకుడుము

  • ఆవిరికుడుము.

ఉబ్బుసగ్గులు. జం.

  • "ఉబ్బు సగ్గు లేనిచ్చలు బోటును బాటు." తాళ్ల. సం. 6. 56.

ఉభయం

  • దైవపూజకు ఒక రోజు ఖర్చు భరించుట.
  • "ఈ రోజు శివాలయంలో ఉభయం నారాయణసెట్టి గారిది." వా.

ఉభయాలు

  • భోజనసామగ్రి. పొయ్యిమీదికీ, పొయ్యి కిందికి పనికి వచ్చునవి.