పుట:PadabhamdhaParijathamu.djvu/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద______ఉది 209 ఉది______ఉదు

  • "ఉదరపోషకులా పొరుగున జేరి." త్యాగయ్య.

ఉదరము మాడు

  • కడుపు మాడు. క్షుత్పీడ కలుగు.
  • "బడబాగ్ని ఘనతరజ్వాలలు మండంగ నుదరంబు మాడె ననగ." కా. మా. 4. 63.
  • చూ. కడుపుకాలు.

ఉదాత్తానుదాత్తస్వరితములు

  • వేదపఠనంలోని స్వరభేదములు. "నమస్తే రుద్రమన్యవ" ఇక్కడ పై గీతలు ఉదాత్తమును, క్రింది గీతలు అనుదాత్తమును తెలుపును. స్వరితం పైన మఱింత ఆపి పలుకుతారు.
  • బస. 7. 184.

ఉదిరిపడు

  • అదరిపడు.

ఉదిరిమల

  • మేరుపర్వతము.
  • "ఉదిరిమలతోడ నొరయగ నెదిరిన దొర-" రాజవాహనవిజయము. 2. 79.

ఉదిలకొను

  • అధైర్యపడు, సంభ్రమపడు, వ్యాపించు.
  • "బెదర వజ్రాయుధు హృదయ, ముదిలకొనగ ద్రిదశగణము..." భార. ఆది. 2. 21.
  • "కృష్ణు డొక్కింతవడి కోర్కి సుదిల కొనియె." హరి. పూ. 3. 252.
  • "వారివాహవ్యూహంబులు కడ లవియ జదల మదిలకొనియె." హర. 6. 58.
  • "మదనవికృతు లంతంతకు నుదిల కొనగ." కేయూర. 4. 7.
  • దీనికి దగ్గఱగా ఉండే అర్థాలలో ఇది ప్రయుక్త మౌతూ ఉంటుంది.

ఉదిలగొను

  • చూ. ఉదిలకొను.

ఉదుక చాలు

  • క్షాళనము చేయగలుగు, పోగొట్ట జాలు.
  • "మొదలియది పాపముల నెల్ల నుదుకజాలు." భీమ. 6. 17.

ఉదుటారు

  • త్రుళ్లి పడు.
  • "..గుబ్బ చను జక్కవలు...పైఠిణీ రవికలో నుదుటారగ..." కాళిందీ 2. 95.

ఉదుటు సూపు

  • అతిశయించు.
  • "ఱెక్కహొన్నంచుపక్కెర యుదుటు నూప." దశా. 2. 66.

ఉదుటెక్కు

  • అతిశయించు.
  • "దీని చూ పుదుటెక్కగానె కా సిరి పట్టి, కిని బోర బిరుదు డెక్కెంబు గలిగె-" ఆము. 6. 105.

ఉదురుమిడుకు

  • ఒక తిట్టు. అదిరి అదిరి పడేవాడు, దుర్మార్గుడు.