పుట:PadabhamdhaParijathamu.djvu/236

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉద్ద______ఉద్ది 210 ఉద్ది_______ఉద్ధా

 • "ఉద్ధతులు గొంట్లు పలుగాకు లుదురు మిడుకులు." హర. 5. 10.
 • కకు. 5. 87.

ఉద్దండపిండము

 • ఘటికుడు.
 • "ఊరు వెడలె నందు రుద్దండపిండంబు నాగనార్యు డెందు డాగినాడొ." రుద్రమ. 70. పు.
 • చూ. ఉక్కుపిండము.

ఉద్దండుడు

 • ఘటికుడు.
 • "వాడా? అబ్బా! ఉద్దండుడు." వా.

ఉద్దరకు వచ్చు

 • తేరకు వచ్చు. రాయలసీమలో ప్రచురంగా వినవస్తుంది. ఉధార్ అన్న మాట తెనుగయిన దిక్కడ.
 • "ఇదేమి ఉద్దరకు వచ్చిందా? పంచిపెట్టడానికి." వా.

ఉద్దిగొను

 • జత గూడు. నేటికీ పిల్ల లాడుకొనేఆటలలో ఇద్దరిద్దరు ఒక్కొక్క ఉద్దిగా పరిగణించడం అలవా టుంది. ఇదే ఉజ్జీలు.
 • "ఇద్దఱు ముద్దియ లుద్దిగొని వీణ లందుకొని..." భాగ. 10. పూ. 1082.

ఉద్ది చేయు

 • జోడించు, కలుపు.
 • "యూపములు నూత్రములతోడ నుద్దిచేసి." కాశీ. 7. 88.

ఉద్దియ చేయు

 • ఉద్యమించు. ఈ 'ఉద్దియ' ఉద్యమములో కానవస్తుంది.

ఉద్ధతము లాడు

 • గొప్పలు పలుకు.
 • "ఈరీతి నతడు శస్త్రని, దారితభుజు డయ్యు నుద్ధతము లాడుచు రా,గా." జైమి. 5. 75.

ఉద్దరించాడు:

 • వ్యంగ్యంగా ఎవరినిగూర్చి అయినా వాడు చేసిం దేముంది అనేఅర్థంలో ఉపయోగించే పలుకుబడి.
 • "తా నేదో మహా పొడిచేస్తున్నట్లు తీరుబడి లేక రాలే నని వ్రాశాడు. ఉద్ధరించాడు!? వా.
 • చూ. ఉద్ధారం చేశాడు.

ఉద్దరిస్తున్నాడు

 • ఉంచుకొన్నాడు.
 • "వాడు దానిని ఉద్ధరిస్తున్నా డట." వా.

ఉద్ధారం చేశాడు

 • వాడు చేసిం దేమీ లేదు అనే అర్థంలో ఉపయోగించే పలుకుబడి.
 • "ఇక్క డింత ఉద్ధారం చేశాడు. ఇక అక్కడ ఉద్ధారం చేస్తాడు! చూస్తూనే ఉంటాం గా." వా.
 • చూ. ఉద్ధరించాడు.

ఉద్దారింపు

 • తాను చేసిన ఘనకార్యం!