పుట:PadabhamdhaParijathamu.djvu/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉచ్చి___ఉచ్చు 199 ఉచ్చు___ఉచ్ఛి

"ఆస్తి సొంతదారుడు రాగానే వీనికి ఉచ్చాటన తప్పదు." వా.

  • "వాళ్లనాన్న రాగానే వీడికి ఆ యింటినుంచీ ఉచ్చాటన జరుగుతుంది." వా.

ఉచ్చిపాఱు

  • దూసుకొని పోవు.
  • "నెఱకుల నుచ్చిపాఱి." జైమి. 2. 37.
  • "పై నొరంగి పొంకపు జన్మొన లుచ్చిపాఱ, గౌగిలి దయసేయ రాదొ." ఉ. రా. 4. 315.

ఉచ్చిపోవు

  • "ఉరుము వడి దాకి వీపున నుచ్చిపోయె." భార. భీష్మ. 3. ఆ.
  • చూ. ఉచ్చిపాఱు.

ఉచ్చుచ్చిరే

  • కుక్కను పిల్చుటలో ధ్వన్యను కరణ మై వినవస్తుంది. నేటి వాడుకలో 'చ్చుచ్చుచొ' అని వినబడుతుంది.
  • "ఉచ్చుచ్చిరే శంకరోచ్ఛిష్టభోగి." బస. 7. 133.

ఉచ్చులు తెంచుకొను

  • నిర్బంధములను తొలగించుకొను.
  • పరువెత్తుటలో అన్ని నిర్బంధాలనూ సడలించికొనె ననుటలో అలవాటై కడకు తెంచుకొని పరుగెత్తాడు. పాఱిపోయాడు అనే అర్థమాత్రద్యోతక మైంది. ఇలాంటిదే తీగలు తెంచుకొని పరుగెత్తు.
  • ".....పులి మె,ల్లనె యవలికి జని వెస జం, గున నచ్చటిలతలు త్రెంచి కొనుచుం బాఱెన్." శుక. 2. 261.
  • ఇది అతివేగంగా ముందూ వెనుకా చూడకుండా పరువెత్తేపట్ల ఉపయోగిస్తారు.
  • "ఉచ్చులు త్రెంచుకొని పరువెత్తాడు." వా.

ఉచ్చులు పన్ను

  • మోసగించుటకై ఎత్తులువేయు.
  • "వచ్చే సంవత్సరం ఖాళీ కాబోయే ఉద్యోగానికి నేటినుంచే వాడు ఉచ్చులు పన్నుతున్నాడు." వా.
  • చూ. ఉచ్చులు వేయు.

ఉచ్చులు వేయు

  • ఎవరినో పట్టుకొనుటకూ, బోల్తా కొట్టించుటకూ మాయలు పన్ను.
  • "ఆ ఆస్తి నంతా కబళించాలని వాడు ఉచ్చులు వేస్తున్నాడు." వా.
  • "ఆ బంగారు పిచ్చుకను దొరకించుకోవా లని వాడు ఉచ్చులు వేస్తున్నాడు. వా.
  • ఛూ. ఉచ్చులుపన్ను.

ఉచ్ఛిష్టపు లేమ

  • ఒకతిట్టు.
  • ఉచ్ఛిష్టం నీచం అనే అర్థంలో. ఇలా యేర్పడిన పలుకుబడులు ఉచ్ఛిష్టపు బ్రతుకు లాంటివి మరికొన్ని ఉన్నవి.
  • "చేతితడార దుచ్ఛిష్టపు లేమ." గౌ. హరి. ద్వి. 890.