పుట:PadabhamdhaParijathamu.djvu/226

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉజ్జ____ఉట్టి 200 ఉట్టి____ఉట్టి

ఉజ్జగొను

 • సరకు సేయు.
 • ఇదెప్పుడు ఉజ్జగొనడు, సేయడు అన్నట్లు వ్యతిరేకార్థంలోనే వినవస్తుంది.
 • "లజ్జాభిమానంబు లుజ్జగొనడు." రుక్మాం. 5. 146.

ఉజ్జన సేయు

 • విడిచిపెట్టు.
 • "సంధ్యాభివందనశ్రద్ధ యుజ్జన సేయ." కాశీ. 4. 81.

ఉజ్జాయింపుగా

 • దాదాపుగా, రమారమిగా.
 • "ఆ యిల్లు కట్టడానికి రెండువే లవుతుందని, ఉజ్జాయింపుగా చెబుతున్నాను." వా.

ఉట్టాడు

 • ఉఱ్ఱ ట్లూగు; ఉర్సుకు డగు.
 • "హరు బి ట్టోడింప నుట్టాడుచున్."
 • పాండు 1. 189.
 • చూ. ఉఱ్ఱట్లూగు.

ఉట్టి కట్టుకొని వ్రేలు

 • తా నేదో చేయబో నున్నట్లు ఉఱ్ఱట్లూగు; ఎప్పుడెప్పుడా అని ఉత్సుకు డగు.
 • "కులధర్మం బెడలించి శ్రీ గురునకుం గోపంబు పుట్టించి మి,త్రుల సౌభ్రాత్ర నివాసదేశముల నీతో బుట్టులం బాసి ని,శ్చలతన్ వ్రేలెద వుట్టి గట్టికొని దుస్సాధ్యంబు సుమ్మీ స్మర, జ్వలనజ్వాలిక సోక నీక నిలువన్ జ్ఞానామృత స్యందమున్." పాండు. 5. 211.
 • "నీ వేదో పొడిచేస్తా నని ఉట్టిగట్టుకొని వ్రేలాడుతున్నావు. కానీ వాడురాగానే నీతోక కోసేస్తాడు జాగర్త!" వా.
 • చూ. ఉట్టి గట్టుకొని ఊగు.

ఉట్టి కెక్కు

 • మూలబడు. పనిఅయ్యాక వస్తువులను ఉట్టిపై ఉంచి వేస్తారు. అందుపై వచ్చిన పలుకుబడి.
 • "ఉట్టి కెక్కు నీసిగ్గులు నోబావ." తాళ్ల. సం. 3. 172.
 • చూ. ఉట్లెక్కు.

ఉట్టి గట్టు

 • అపహాస్యము చేయు. తాటాకులు కట్టు వంటిది. ఉట్టి కట్టుకొని ఊరేగుతున్నాడు; వాణ్ణి ఉట్టి కట్టి ఊరేగిస్తాము అని వాడుక ఉన్నది. ఈ పలుకుబడి వాడుకలో నేడున్నట్టు లేదు.
 • "..సరకు గొనండు...టక్కరి బలుమోపు మోచు నయగారితనం బది యుట్టిగట్టినన్." ఉత్త. హరి. 4.

ఉట్టి గట్టుక వ్రేలు

 • "ఉట్టి గట్టుక వ్రేలుచున్నాడు." గౌ. హరి. ద్వితీ. పంక్తి 1758.
 • చూ. ఉట్టిగట్టుకొని ఊగు.

ఉట్టి గట్టుకొని ఊగు.

 • ఏదో అత్యాశతో ఉవ్విళ్లూరు.
 • "గట్టిగా జావుకు గడు తెంపు జేసి, యుట్టి గట్టుక నూగుచున్నాడు దేవ." రంగనా. యుద్ధ. 357. పే.
 • చూ. ఉట్టి గట్టుకొని ఊరేగు.