ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇంత_____ఇంత 144 ఇంత_____ఇంత
నెఱుగుదును. నా కింతమాత్రం తెలియదా?" వా. ఇంతమాత్రమె కాదు
- ఇంతే కాదు...
- ఏవైనా గుణాలను వర్ణించేటప్పుడు, మరికొన్ని చెప్పవలసినచోట యీ పలుకుబడిని ఉపయోగిస్తారు.
- "ఇంతమాత్రంబె కాదు శ్రీమంతుడును నితాంతశుభవంతు డగువసుమంతు డలర." శుక. 1. 178.
- "అతడు ధనవంతుడు, విద్యావంతుడు, ఇంతే కాదు. ఉదారుడు." వా.
ఇంతమొగము చేసుకొను
- చిన్నబుచ్చుకొను.
- "రాగానే అతను లేచిపోయేసరికి తాను ఇంత మొగం చేసుకున్నాడు."
ఇంత యం తనగ రాని
- ఎంతో చెప్ప వీలు లేని ; అత్యధిక మైన.
- "అంత నయ్యింతి యింత యం తనగ రాని, వంత దన యంతిపురి జేరి కంతునిశిత..." శుక. 1. 236.
ఇంత యింతగా కోసినా పాపం లేదు
- ఎంత ఆఇక్ష కైనా తగు నను పట్ల ఉపయోగించే పలుకుబడి.
- "కోసిన నేమి పాప మగు గోమలి నాలుక యింత యింతగా." పారి. 4. 12.
ఇంతలింతలు
- చిన్న చిన్న
- "ఇంతలింతలు తునియ లై." ఉద్యో. 3. 117.
ఇంతవట్టు
- 1. ఇంతమాత్రము.
- "ఇంతవట్టు తగ జేయుము." భార. ఆర. 4. 387.
- "ఇంతవట్టు నిజంబు." భార. ఉద్యో. 2. 302.
- వాడుకలో ఇంతమాత్రం అని వినిపిస్తుంది.
- "నువ్వు అది అంతా చేయ నక్కఱ లేదు. ఇంతమాత్రం చేస్తే చాలు." వా.
- "వాడు చెప్పిందంతా యేమో కానీ ఇంతమాత్రం నిజం. వాడు ఆ ఊరు వెళ్ళి వచ్చాడు." వా.
- 2. ఇంతవఱకు - ఇంతకాలం.
- "ఇట్టి నీవు సుట్టమ వై యింతవట్టు, వారిలో నున్న వాడవు వారిజాక్ష!" హరి. పూ. 7 ఆ. 233 ప.
- చూ. ఇంతమాత్రము.
ఇంతవార మనుకొను
- గర్వించు.
- "తరుణీ యేరికి జెల్లునె, యరయగ నే మింతవార మనుకొన నిదిగో..." కళా. 1. 179.
- "మే మింతవార మని మిడిసిపడడం యేమంత మంచిది కా దమ్మా! కోడలా!" వా.
ఇంతలు కన్నులు
- ఇంత విశాలము లయిన కన్నులు.
- "ఇంతలు కన్ను లుండ దెరు వెవ్వరి వేడెదు భూసురేంద్ర!" మను. 2. 41.