ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆడు______ఆడు 116 ఆడు_____ఆత
నప్పుడు ఆడవాళ్లు అనేమాట. 'నీకు అక్కా చెల్లెళ్లు లేరా? న న్నలా అవమానిస్తావా' అని. నేటికీ వాడుకలో 'నీ కేం అక్కా చెల్లెళ్లు లేరా? నా వెంట బడుతున్నావు?" అంటారు. ఆడుతోడు లేరా>? అని కూడా క్వాచిత్కంగా అంటారు.
- "పుర మిది చూడ నింత చెడిపోయె నయోమఱి యాడుతోడ బు, ట్టరె? ననువంటి సాధ్విని..." శుక. 2. 369.
ఆడుదోడునను బుట్టవె?
- నీకు అక్కా చెల్లెండ్లు లేరా?
- "బోయవె యాడుదోడునను బుట్టవె శాపనిమిత్తమే తపంబు." మను. 4. 87.
- చూ. ఆడుతోడ బుట్టరె.
ఆడుపడుచు
- భర్తృ సోదరి.
- చూ. ఆడుబిడ్డ.
ఆడుపడుచు సిరి
- నిలవనిది.
- ఆడవాళ్ల చేతిలో డబ్బు నిలవ దనుట. మగవారే పెత్తనం వహించవలెనన్న నాటి భావంపై ఏర్పడినది.
- గువ్వలచెన్న. 33.
- చూ. ఆడదానిచేతి అర్థము.
ఆడుపాటు
- స్త్రీత్వము.
- "మాయయు జీవుడుం బెరసి మైత్రి యొకానొక డాచరించుచుం బాయక యాడుపాటు మగపాటువడన్."
- పాండు. 4. 274.
ఆడుబిడ్డ
- ఆడుపడుచు.
- ఆడుబిడ్డ, ఆడుపడుచు అను మాటలు భర్తృసోదరి అన్న అర్థంలో నేటికీ వాడుకలో ఉన్నవి.
- "కొత్తగా జేయించుకొన్న ముక్కరకు నై యడలు దుర్వారమై యాడుబిడ్డ." పాండు. 3. 50.
- "పెళ్లిలో ఆడబిడ్డ (పడుచు) లాంఛనాల కని వాళ్లు చాలా అడిగారు. అంచేత పెళ్ళి కుదర లేదు."
- "ఉగాదికి మా ఆడపడుచును పంప మని మా వారు వాళ్ల వాళ్ళకు రాశారు." వా.
- చూ. ఆడుపడుచు.
ఆడ్యుడు
- నాథుడు.
- "వాళ్ళ యింటికి ఆడ్యుడు ఎవడూ లేడు." వా.
- "వాళ్ళది ఆడ్యుడు లేని సంసారం." వా. *చూ. నాథుడు.
ఆణిపూస
- శ్రేష్ఠుడు.
- "కాళిదాసు కవుల్లో ఆణిపూస." వా.
ఆతని పేరికూర నంజకుము
- అతని పే రయినా యెత్తకు మనుట. వాని పేరున్న కూర కూడా ముట్టకూడదంటే అంతేకదా.