ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆడు_____ఆడు 115 ఆడు______ఆడు
- "వసుధాధరేంద్రసుత నీ వసదృశముగ, శివుని గూడియాడుట యాడుం బసిపని." కుమా. 7. 37.
ఆడుకట్టు
- ఆడుపోడిమి.
- "కాళ్ల యొప్పిద మాడుకట్టు నుజ్జ్వలము సేయంగ...." భార. విరా. 1. 228.
ఆడుకుంటున్నాను!
- వినోదంగా గడపడం లేదు; పనే చేస్తున్నాను అని చెప్పడానికి వ్యంగ్యంగా ఉపయోగించే పలుకుబడి.
- "ఏమటమ్మా! అన్నిసార్లు పిలుస్తావు. నే నేం ఆడుకొంటున్నానా?" వా.
- "ఆ అవును. నువ్వే ఇంటిపను లంతా చేస్తున్నావు. నే నేమో ఆడుకొంటున్నాను." వా.
- చూ. ఆట్లాడుకుంటున్నాను.
ఆడుకూతురు
- ఆడపిల్ల.
- "పడసె గాదె శంకర, గొనకొన బుంస్త్వమ్ము నాడుకూతురు నీచేన్." శివ. సా. 417.
- "ఆడుకూతురు నలా ఏడిపించరాదురా." వా.
ఆడుకొన నోరు గల్గు
- దూషించుట కవకాశము కలుగు.
- "అకట! నాయీడు రాచకన్నెకల కెల్ల, గడగి న న్నాడుకొన నోరు గల్గె నే మనందు." శుక. 1. 474. ప.
ఆడుగోడు పోసికొను
- ఆడవారిని యేడిపించు.
- "ఈ ఆడుగోడు, పోసికో నేల నీవంటి పుణ్యమతికి." పాండ. జన. నాట. 26.
ఆడుగొల
- స్త్రీహత్య.
- తాళ్ల. సం. 6. 57.
ఆడుచు పాడుచు
- తీరికగా, అనాయాసంగా. జం.
- "ఆడుచు బాడుచు నభిమతార్థములు, వేడుక భక్తులు వేడిన నిత్తు." ప్రభులిం. 14. 112 పు.
- "అంటును సొంటునుం దెలుప కాడుచు బాడుచు గూడుచుండె బో." పాణి. 3. 82.
- చూ. ఆడుతూ పాడుతూ.
ఆడుతీర్పరులు
- ఆడపెత్తనదారులు; పొసగ రనుట.
- తీర్పరు లెప్పుడూ మగవారే అయి యుండవలె నన్న అపోహపై యేర్పడినపలుకుబడి.
- కుక్కు. 22.
ఆడుతూ పాడుతూ
- హాయిగా, అవలీలగా.
- "ఆడుతూ పాడుతూ ఆ యింతపనీ చేసుకోవచ్చు." వా.
- చూ. ఆడుచు పాడుచు.
ఆడుతోడ బుట్టరె?
- అక్క చెల్లెండ్లు లేరా?
- ఏ పురుషు డైనా ఒక స్త్రీతో అవమానకరంగా ప్రవర్తించి