ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆడ_____ఆడ 114 ఆడి_____ఆడు
- "ఆడదక్షత లేనియింట్లో పిల్లలు ఎలా ఉంటారు మరి!? వా.
- చూ. ఆడదిక్కు.
ఆడదానిచేతి అర్థము
- నిలవనిది.
- చూ. ఆడుపడుచు సిరి.
ఆడదిక్కి
- చూ. ఆడదక్షత.
ఆడపాప
- రాజాస్థానాలలో పెండ్లి చేసు కొనకుండా ఉండేదాసి.
- 'కార్వేటినగరంలో ఇన్నూరుమంది ఆడపాపలు ఉండేవారు." వా.
ఆడబిడ్డలాంఛనాలు
- పెండ్లిండ్లలో వరుని తోబుట్టువులకు చీరలు, సొమ్ములు వగైరాల కని యిచ్చు కానుకలు.
- "ఆడబిడ్డలాంఛనాలకు అధమపక్షం అయిదువంద లయినా యివ్వందే పెండ్లి కుదరడం కష్టం అన్నారు అవధానులు గారు." వా.
ఆడబోవుతీర్థ మెదు రగు
- కోరినపని తనంతటనే సిద్ధించు.
- "ఆడుమిందున గైలాస మాడబోవు తీర్థ మెదు రైనరీతి సిద్ధించు ననుడు." కా. మా. 3. 214.
ఆడబోయిన తీర్థ మెదురు వచ్చినట్లు
- శ్రమ లేక మనోరథం సమకూరిన దనుట.
- పండితా. ప్రథ. పురా. పుట. 387.
- చూ. ఆవులు తలచినచోట పూరి మొలచినట్లు.
ఆడికపడు
- నిందపడు.
- "ప్రజలచే నాడికపడుదును." జైమి. 8. 114.
ఆడికొను
- 1. ఒకరిని గూర్చి చెప్పుకొను, నిందగా మాటలాడుకొను.
- "అతని దుశ్చారిత్రము లెల్లవిని యక్క డక్కడ నాడికొనం దొడంగిరి." శివ. 3. 119.
- 2. నిందలు వేయు.
- "బంధువుల్ గనినచో బరగ నిందింతురు, తోడికోడలు చూడ నాడికొనును." హంస. 1. 125.
ఆడికోలు
- నింద.
- "కుల మెంచ రాడికోళ్ళకు దలకరు." హంస. 5. 267.
ఆడిన దాట పాడినది పాటగా
- స్వేచ్ఛగా, అడ్డుపెట్టువారు ఎవరూ లే రనుట.
- "వా డాడింది ఆట, పాడింది పాటగా ఉంది. అనేవారా? ఆడేవారా?" వా.
ఆడిపోసికొను
- వెనుక తిట్టుకొను.
- "వారు ఊరికే నన్ను ఆడిపోసుకొంటున్నారు. నే నేపాపమూ ఎఱుగను." వా.
ఆడుంబసిపని
- బాల్య చేష్ట, పసిపిల్ల చేయ వలసినపని.