పుట:PadabhamdhaParijathamu.djvu/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆట_____ఆట 113 ఆటి_____ఆడ

ఆట మాని ఒడ్డుకొనబడు

 • మధ్యలో ఆట మానివేసి ఓటమిని అంగీకరించు.
 • త న్నెలానో వదిలివేయ మని చెప్పుపట్ల ఉపయోగించే పలుకుబడి.

            "సకియలు జాగు మాను డిక జాలును
             బోవుద మాట మాని యొ, డ్డుకొన
             బడెన్ నృపాత్మజ కడున్ బరితాపము
             నొంది....."
                                   నలచ. 3. 264.

ఆటలమ్మ

 • మశూచికంలో ఒక భేదము. ఇది సామాన్యంగా పిల్లలకు వస్తూంటుంది. తట్టు, చిన్నమ్మ, పెద్దమ్మ ఇతరభేదాలు.

ఆటలో అరటిపండు

 • వట్టిది.
 • ఆటలో ఒక్కొక్క రాయికో పండుపేరు పెడతారు. అసలవి ఊహామాత్ర మైనవే.

ఆటవిడుపు

 • సెలవు.
 • వీధిబళ్ళలో నేటికీ ఈ మాట ఇలాగే వినవస్తూంది.
 • "ఉడిగములవారలకు నాటవిడుపు గాగ." కువల. 4. 101.

ఆట సాగదు

 • తోచినట్లు ప్రవర్తించుటకు వీలు లేదు అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
 • "సంస్కృతమ్మున నింతగా సాగ దాట." పాణి. 1. 29.

ఆటి నిల్చు

 • ఆగి నిలుచు.
 • "ఏమియున్, డయ్యక కొంతసేపు పెను ఢాకను జేతుల కాటి నిల్చువా, డెయ్యెడ." ప్రభా. 2. 59.

ఆటోపంగా

 • అట్టహాసంగా.
 • "చాలా ఆటోపంగా ఉన్నాడు." వా.

ఆట్లాడుకుంటున్నాను!

 • చూ. ఆడుకుంటున్నాను.

ఆట్లుపోట్లు

 • బాధలు. జం.

ఆడంగులలో పెదబావగారు

 • ఎప్పుడూ ఆడవాళ్లతో ఉండే వాడు.
 • నిరసనగా అనేమాట.
 • "ఉన్నాడుగా ఆడంగుల్లో పెదబావగారు. ఎక్క డెక్కడి కబుర్లూ తెస్తాడు." వా.

ఆడంగులవాడు

 • ఆడచేష్టలు చేసేవాడు, నపుల సకుడు.
 • "వాడు వట్టి ఆడంగులవాడు. బయట ఏం కనిపిస్తాడు?" వా.

ఆడకాడకు

 • అక్కడి కక్కడకు.
 • "ఏం జరగడం లే అమ్మా ! ఆడకాడకు సరిపోతుంది." వా.

ఆడదక్షత

 • ఆడదిక్కు.