ఈ పుట ఆమోదించబడ్డది
అభ్య_____అభ్ర
75
అమ_____అమా
అభ్యంగము
- నూనె అంటుకొని చేయు స్నానము.
- హర. 4. 79.
అభ్యంజనోద్వర్తన స్నానంబులు
- తలంటుకొని నలుగు పెట్టుకొని స్నానము చేయుటలు. ఇది కలిసే వాడడం అలవాటు.
- "అభ్యంజనోద్వర్తన స్నానానంతరం బన."
- కుమా. 9. 23.
అభ్యుదయ పరంపరాభివృద్ధిగా
- శుభపరంపరలు కలుగు నట్లుగా.
- ప్రబంధాల అవతారికలలో విరివిగా కానవచ్చే పలుకుబడి.
- "(కృతిపతికి) అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొన్పరం బూనిన...కథా ప్రారంభం బెట్టి దనిన."
- చాలా ప్రబంధాలలో.
అభ్యుదయించు
- అభివృద్ధిపఱచు, పెంచు.
- "అధ రారుణద్యుతి నభ్యుదయింపనే పొలతి నీయాన నాంభోజ మలర."
- కుమా. 5. 131.
అభ్రచ్ఛాయ
- అస్థిరము.
- మేఘమునీడ కాసే పయినా ఉండదు కనుక.
- పాండు. 3. 72.
అభ్రపుష్పము
- గగనకుసునము.
"పాపము లభ్రపుష్పములు, బంధనముల్
శశశాబశృంగముల్, తాపవికారముల్
మరుజలంబులు పుట్టువు లశ్మతైలముల్."
పాండు. 5. 72.
అమందానంద కందళిత హృదయారవిందు డై
- సంతోషించి అనుపట్ల విరివిగా ఉపయోగించేపలుకుబడి.
అమాంతంగా
- ఉన్నట్టుండి - పూర్తిగా.
అమాంబాపతు
- చిల్లర, అన్నిరకాల-
- "అమాంబాపతు కాగితా లన్నీ ఇందులోనే ఉన్నాయి." వా.
- "అమాంబాపతు జనం అంతా ఆ యింట్లో చేర్తారు." వా.
అమానుషమైన
- అవమానకర మైన.
- "ఇంత అమానుష మైన పని చేస్తుం దని నే ననుకో లేదు." వా.
అమారుగా
- సిద్ధంగా.
- "ప్రయాణానికి అమారుగా ఉన్నారు." వా.
అమావస్యమందు
- చూ. అమాసమందు.
అమాసమందు
- ఇది రాయలసీమలో ప్రచురంగా ఉన్నమాట. నాగలాపురందగ్గర ఒక కుటుంబం వారు ప్రతీ అమావాస్య నాడూ ఆ మందిస్తారు. ఏవో