పుట:PadabhamdhaParijathamu.djvu/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అము____అమృ

76

అమ్మ_____అమ్మ


కొన్ని ఆకులు దంచిన పొడి అది. ఆ పొడి తిని జొన్న సంకటి తింటే సర్వరోగాలూ నివారణ అవుతా యని గొప్ప నమ్మకం. నేటికీ కొన్ని వేల మంది అక్కడ చేరుతుంటారు.

  • ఇది తరువాత పలుకుబడిగా మారింది. అమావాస్యమందు అని తొలిరూపము.
  • "ఓ యబ్బా ! యి దేమి అమాస మందా? ఈన ఇస్తానే బాగు కావడానికి?" వా.

అములు చేయు

  • అధికారము చెలాయించు.
  • కొత్త. 33.

అమృతకలశం

  • ఒక తినుబండం.

అమృతఘటికలు

  • ఒక తినుబండం.

అమృతహస్తము

  • వ్యాధినివారకమైనచేయి.
  • చెయివాసిగలది.
  • "ఆయనది అమృతహస్తం. మన్ను మాత్ర చేసి యిచ్చినా రోగం నయమవుతుంది." వా.

అమృతహస్తుడు

  • అత నేమిచ్చినా రోగనివారణ అగును అనుపట్ల ఉపయోగిస్తారు.
  • వెంకటేశ. 15.

అమ్మక చెల్ల

  • ఆశ్చర్యార్థకము.
  • "అమ్మకచెల్ల ! నా హృదయ మమ్మక చెల్లదు." విజయ.
  • చూ. అమ్మ నే జెల్ల.

అమ్మకు రెండు అబ్బకు రెండు వచ్చు

  • తలిదండ్రులకు చెడ్డ పేరువచ్చు.
  • కుమారీ. శత. 19.
  • "ఈ పిల్ల అత్తవారింటికి వెడితే అమ్మకు రెండు అబ్బకు రెండు వస్తాయి. అలా పెంచారు మీరు." వా.

అమ్మక్క

  • ఆశ్చర్యార్థకము.
  • "అమ్మక్క యని సతు లక్కజం బంద." రా బాలకాండ.
  • చూ. అమ్మక చెల్ల.

అమ్మగా చిక్కిన మేకవలె

  • ఏకాకిగా ; బక్క చిక్కి, మేక లన్నీ అమ్మి వేయగా మిగిలి పోతిన మేక అతి దుర్బలమైనదిగా ఉంటుంది.

"హత శేష సైన్యముల్, గ్రక్కున విచ్చె
వీపు వెనుకన్ మఱి మానిసి లేక యమ్మ
గా జిక్కినమేకవోలె వగ జెంది
నిజాధిపు డొంటి జిక్కగం."
                 కళా. 8. 65.

అమ్మతోడు

  • అమ్మసాక్షిగా, ఒకరక మైన ప్రమాణవాక్యము.
  • గుంటూ. పూ. 16 పు.