పుట:PadabhamdhaParijathamu.djvu/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అబ్బ____అభ

74

అభ____అభో


అబ్బబ్బ

  • భరింప రాని దనుపట్ల అనే ఉపస్కారకం.
  • "అబ్బబ్బ! ఏమి అల్లరి చేస్తున్నా ర్రా." వా.

అబ్బురమా?

  • అరుదు కా దనుట.
  • "అ దేమి అబ్బరమా? ఎవడు పడితే వాడే చేస్తాడు." వా.
  • చూ. అదేం గగనమా?

అబ్రహ్మణ్యము

  • ఏ దైనా అనాహూతం జరిగినప్పుడు అనుమాట. సంస్కృత నాటకాల్లో తరచూ ద్విరుక్తమై వినబడుతుంది.
  • "అబ్రహ్మణ్యము! లోన వైచుకొనె నన్యాయంబునన్ మత్సుతన్." ఆము. 7. 44.

అభయము

  • శరణు; నన్ను రక్షించు మంటూ ఒకరిని శరణు చొచ్చే వారు అనేమాట. అభయ మివ్వుడని భావం.
  • "అభయ మభయ మయ్య అంబికా నాథ?"
  • పండితా. ప్రథ. వాద. పుట. 631.

అభయదానం బిచ్చు

  • రక్షింతు నని మాట యిచ్చు.
  • "సాధ్వసంబున జనుల్ శరణంబు వేడిన, నభయదానం బిచ్చునట్టి వారు." రుక్మాం. 2. 89.

అభయహస్త మిచ్చు

  • భయము లేదని ధైర్యమిచ్చు.
  • "కంపము నొంద నోడకుం డని తిమిరంబు తా నభయహస్తము లిచ్చె ననంగ." పారి. 2. 36.

అభాండము వేయు

  • అపవాదు వేయు.
  • "పాపం ! అలాంటి అమ్మాయిమీద అభాండాలు వేసి వాళ్ల కాపురం తీశాడు." వా/

అభినవించు

  • కొత్తదనము లొల్కు.
  • "వెలయ రసంబులం దభినవించె రసంబులు..." కుమా. 9. 38.

అభిషేక మాడు

  • స్నాన మాడు.
  • "అభిషేక మాడు నేయభివర్ణి తాచార దిగ్గజానీతమా తేటనీట." పాండు. 1. 2.

అభిషేకించిన అగ్నిహోత్రములా

  • బొగ్గులాగ నల్లగా.
  • "నేను ఆ మాట అనేసరికి వాడి మొహం అభిషేకించిన అగ్నిహోత్రంలా అయి పోయింది." వా.

అభోజనం పడుకొను

  • పస్తు పరుండు.
  • కన్యా. శు.
  • "వాడు రాత్రి అభోజనం పడుకొన్నాడు." వా.